Thaman: 45 లక్షలు… హోటల్ రూం బిల్లుతో నిర్మాతకు షాక్ ఇచ్చిన థమన్!!

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇటీవల కాలంలో ఆయన మ్యూజిక్ అందిస్తున్న సినిమాలు అన్నీ కమర్షియల్ గానే కాకుండా మ్యూజికల్ గా కూడా మంచి సక్సెస్ సాధిస్తున్నాయి. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ సినిమాలకు థమన్ అందిస్తున్న మ్యూజిక్ బాగా వర్కౌట్ అవుతుంది. దీంతో ఆయనకు నందమూరి ఫ్యాన్ బేస్ నుంచి బాగా సపోర్ట్ లభిస్తుంది. రీసెంట్ గా బాలయ్య, థమన్ కాంబోలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి.

అఖండ, భగవత్ కేసరి వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించింది. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కూడా వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి సినిమాలకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించి మెగా ఫాన్స్ మెప్పును కూడా పొందాడు తమన్. ప్రస్తుతం తమన్ తెలుగులో ఫుల్ బిజీగా ఉన్నా మ్యూజిక్ డైరెక్టర్. ఇది ఒక వైపు మాత్రమే… తమన్ మరోవైపు ఏంటంటే ఆయన సాంగ్స్ మ్యూజిక్ ను కాపీ కొడతాడనే విమర్శలు ఉన్నాయి.

అందుకే ఆయన్ని కాపీ క్యాట్ అంటూ కామెంట్స్ చేస్తుంటారు. అయినప్పటికీ టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్స్ కొరత గట్టిగా ఉండడంతో తమన్ కే సినిమాలు అప్పజెప్తున్నారు మేకర్స్. ఏదైతేనేం హీరోలకు సూపర్ హిట్స్ అయితే అందిస్తున్నాడు కదా. అలాగే ఆయన రెమ్యూనరేషన్ కూడా గట్టిగానే అందుకుంటున్నాడట. ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కో సినిమాకు ఐదు కోట్ల వరకు పారితోషకం అందుకుంటున్నాడని సమాచారం. ఇక రెమ్యూనరేషన్ విషయం పక్కన పెడితే, తమన్ కొన్నిసార్లు నిర్మాతలకు భారీ షాట్లు ఇస్తూ ఉంటాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

- Advertisement -

ఇటీవల ఒక సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసమని పార్క్ హయత్ హోటల్లో ఒక స్పెషల్ రూమ్ తీసుకున్నాడట. ఆ రూమ్ బిల్ ఏకంగా 45 లక్షల అయిందట. కేవలం మ్యూజిక్ సిటింగ్స్ కే ఇంతటి భారీ బిల్ పంపిన థమన్ తీరుతో సదరు నిర్మాతలకి చెమటలు పట్టాయని టాక్ నడుస్తోంది. మరి తమన్ ఇదే తీరు కంటిన్యూ చేస్తే నిర్మాతలు ఆయనను తీసి పక్కన పెట్టడానికి ఏమాత్రం మొహమాట పడరు.

ఎందుకంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో మణిశర్మ, దేవి శ్రీ ప్రసాద్ వంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఉండగా,  మరోవైపు అనూప్ రూబెన్స్, గోపి సుందర్, అనిరుధ్ వంటి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్లకు గట్టి పోటీని ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. కాబట్టి థమన్ ఇదే పంథాలో కొనసాగితే ఆయనకు అవకాశాలు తగ్గడం గ్యారంటీ. నిజానికి మ్యూజిక్ సిట్టింగ్స్ పేరుతో నిర్మాతలకు ఈ రేంజ్ లో బిల్లు బాదిన వారి దాఖలాలు ఇప్పటివరకు టాలీవుడ్ చరిత్రలోనే లేవేమో.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు