Sridevi’s personal life : చెల్లి అని పిలిచి హీరోయిన్ శ్రీదేవిని ప్రెగ్నెంట్ చేసింది ఎవరంటే..?

Sridevi’s personal life

బాలనటిగా చిత్ర సీమలో అడుగుపెట్టి ఆ తరువాత ఆల్ ఇండియాలో తెలుగు, తమిళ్, హిందీ సహా పలు భాషలలో నటిస్తూ.. లేడీ సూపర్ స్టార్ గా సత్తా చాటిన శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈ అతిలోకసుందరి చిన్న వయసులోనే హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు ఇలా స్టార్ హీరోలు అందరితోనూ జత కట్టింది.

అలాంటి శ్రీదేవి గురించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. రాఖీ కట్టిన వ్యక్తితోనే శ్రీదేవి ప్రెగ్నెంట్ అయిందట. శ్రీదేవి మొదట మిథున్ చక్రవర్తిని రహస్యంగా పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ కలిసి ఎక్కువ సినిమాలలో నటించడం వల్ల వీరి మధ్య ప్రేమ పుట్టి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మిథున్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంతో శ్రీదేవి అతనికి దూరంగా ఉంటూ వచ్చింది.

ఆ తరువాత శ్రీదేవికి బోనీ కపూర్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో మిస్టర్ ఇండియా అనే సినిమా తీయాలని అనుకున్నారు. ఈ సినిమాలో నటించడానికి శ్రీదేవి 10 లక్షలు అడిగితే.. బోనీ కపూర్ 11 లక్షలు ఇస్తారని చెప్పి శ్రీదేవిని ఆ సినిమాలోకి తీసుకున్నారు. ఇక ఆ తర్వాత శ్రీదేవిని ఎలాగైనా బుట్టలో వేసుకోవాలనే ఉద్దేశంతో బోనీకపూర్ ప్రయత్నాలు చేసేవారట. కానీ ఆయనకు అప్పటికే పెళ్లి అయ్యి ఇద్దరి పిల్లలు కూడా ఉన్నారు.

- Advertisement -

అయితే శ్రీదేవి.. బోనీకపూర్ ని అన్నయ్య అని చాలా సార్లు పిలుస్తూ రాఖీ కూడా కట్టింది. కానీ బోనీ కపూర్ మాత్రం శ్రీదేవిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించి.. శ్రీదేవి తల్లికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు దగ్గరుండి అన్ని చూసుకున్నారు. అలా శ్రీదేవికి దగ్గరై పెళ్ళికి ముందే శ్రీదేవిని గర్భవతిని చేశాడట. ఈ విషయం తెలిసిన బోనీ కపూర్ మొదటి భార్య అతనికి విడాకులు ఇచ్చేసింది. బోనీతో పెళ్లి సమయానికి శ్రీదేవి 7 నెలల గర్భిణి. రెండు నెలల తరువాత జాన్వి కపూర్ జన్మించింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు