Chiranjeevi Remuneration Details: “భోళా శంకర్” కి చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతంటే?

Chiranjeevi Remuneration Details

మెగాస్టార్‌ చిరంజీవికి ఉన్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే.. ఎనిమిదేళ్ల క్రితం తమిళంలో బంపర్ హిట్ అయిన వేదాళం సినిమాను చిరు భోళా శంకర్ గా రీమేక్ చేస్తున్నాడు. వాల్తేరు వీరయ్య వంటి మ్యాసివ్ కంబ్యాక్ తర్వాత చిరు ఈ రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు.

ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు, పాటలు కాస్త మంచి హైప్ ని తీసుకొచ్చాయి. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ప్యాచ్ వర్క్ లలో బిజీగా ఉంది. ఈ సినిమాపై మెగా అభిమానులు అమితాసక్తితో ఎదురుచూస్తున్నారు. దానికి తోడు ఇటీవలే రిలీజ్ అయిన టీజర్ మెగా అభిమానులను తెగ ఆకట్టుకుంది. మరో నెల రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాపై జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తున్నారు.

తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కు వస్తున్న స్పందన కూడా అదిరిపోయింది. అయితే ఈ సినిమాకు మెగాస్టార్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. మంచి పారితోషికం ముట్ట చెప్తామన్నా సరే తీసుకోవడానికి నిరాకరించాడట. అందుకు కారణం లేకపోలేదు. భోళా శంకర్ సినిమాపై బోలెడంత నమ్మకం పెట్టుకున్న చిరు అందులో వాటా కావాలని కోరాడట. ఇప్పటికే సినిమా థియేట్రికల్, ఓటిటి హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. కాబట్టి సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే లాభాల్లో చిరంజీవి అడిగినంత మొత్తాన్ని ఇచ్చేందుకు మేకర్స్ అంగీకరించారంటూ ఓ వార్త ఫిల్మీ దునియాలో చక్కర్లు కొడుతోంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు