Sri mukhi: అవినాష్ గుట్టు రట్టు చేసిన శ్రీముఖి.. ఎలాంటి వాడంటే..?

బుల్లితెర రాములమ్మగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన వాక్చాతుర్యంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలకు హోస్ట్గా వ్యవహరిస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంది. అంతేకాదు బిగ్ బాస్ ద్వారా మరింత క్రేజ్ సొంతం చేసుకున్న శ్రీముఖి ఇప్పుడు సినిమాలలో కూడా నటిస్తూ తన ఇమేజ్ రెట్టింపు చేసుకుందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా యాంకర్ శ్రీముఖి తన ప్రాణ స్నేహితుడైన ముక్కు అవినాష్ పైన సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ముక్కు అవినాష్ , శ్రీముఖి మధ్య మంచి స్నేహబంధం ఉంది. అంతేకాదు అవినాష్ కష్టాల్లో ఉన్నప్పుడు శ్రీముఖి ఆర్థికంగా అండగా నిలిచింది అని.. ఒకానొక సందర్భంలో అవినాష్ వెల్లడించారు. ఇక జబర్దస్త్ వదిలి బిగ్ బాస్ కి వెళ్లిన తర్వాత జరిగిన పరిణామాల వల్ల శ్రీముఖి తనకు అండగా ఉందని.. ఆమధ్య చెప్పుకొచ్చారు. ఇక శ్రీముఖి ఇంట్లో మనిషిలా కలిసిపోతాడు.. ఇద్దరూ కలిసి రీల్స్ కూడా ఎన్నో చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఆదివారం స్టార్ మా పరివార్ షో కూడా చేస్తున్నారు.

ఇద్దరూ కలిసి జోకులు వేసుకుంటారు. నవ్వులు పూయిస్తూ ఉంటారు. ఇలాంటి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తాజాగా శ్రీముఖి మాట్లాడుతూ.. ఇది కార్పొరేట్ షో కాదు కోపరేట్ చేస్తావా అని అవినాష్ అడిగినట్టు ఆరోపించింది. అంతటితో ఆగకుండా ఆమె ఏకంగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కి చెప్పింది.. తనను ఇలా అంటున్నాడని ఆయన ముందు గోడు వెళ్ళబోసుకుంది. ఇది ఒక ఎత్తు అయితే అది ఒక షోలో జరగడం మరొక ఎత్తు.. దీంతో ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే దీనికి స్పందించిన అవినాష్ తీవ్రంగా ఖండిస్తూ తనకే పాపం తెలియదని అంటాడని అందరూ భావించారు. కానీ అలా అనలేదు. అమ్మతోడు సార్ చెబుతున్న తాను అలానే అన్నట్టు ఒప్పుకోవడం విశేషం.

- Advertisement -

ఇకపోతే షోలో ఇదే హైలెట్గా నిలిచింది. అయితే ఇదంతా కూడా ఒక షో కోసం కావడం విశేషం. మొత్తానికైతే వీళ్లంతా కలిసి షోలో ఇలాంటి ఆరోపణలు చేయడం నిజంగా ఫన్నీగా అనిపించింది. ఇక ఏ షో అనే విషయానికొస్తే.. ప్రస్తుతం అనిల్ రావిపూడి జడ్జిగా ఆహా లో కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షో కొత్తగా ప్రారంభమవుతుండగా ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో ఇదంతా జరిగినట్లు సమాచారం.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు