Tollywood: తండ్రీ కొడుకులతో కలిసి నటించిన హీరోయిన్స్ వీళ్ళే..!

ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్ల లైఫ్ టైం సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ అని చెప్పాలి. ముఖ్యంగా హీరోయిన్గా కొంతకాలం నటించిన తర్వాత ఇక వారి ఇమేజ్ కూడా తగ్గిపోతుంది. ఈ క్రమంలోనే వారు.. తర్వాత అక్క , చెల్లి, వదిన అంటూ క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో సరి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మరి కొంతమంది హీరోయిన్లు మాత్రం అటు తండ్రితో ఇటు కొడుకుతో కూడా నటించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రత్యేకించి కొంతమంది హీరోయిన్లు సంవత్సరాల తరబడి హీరోయిన్లుగా చలామణి అవుతూ ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తండ్రి కొడుకులతో కలిసి నటించిన హీరోయిన్ల గురించి ఇప్పుడు చూద్దాం.

రానా, వెంకటేష్ , నయనతార:
గత 17 సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న నయనతార అటు వెంకటేశ్వర్ తో కలిసి “లక్ష్మీ ,తులసి” సినిమాలు చేయగా రానాతో కలిసి “కృష్ణం వందే జగద్గురుం” సినిమాలో నటించింది.

అక్కినేని నాగేశ్వరరావు , నాగార్జున, శ్రీదేవి:
అందాల తార శ్రీదేవి అక్కినేని నాగేశ్వరరావు తో ఎన్నో సినిమాలలో నటించింది. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు కొడుకు నాగార్జునతో కూడా గోవిందా గోవిందా, ఆఖరిపోరాటం వంటి సినిమాలలో నటించింది.

- Advertisement -

బాలకృష్ణ, ఎన్టీఆర్ , శ్రీయ:
ప్రముఖ సీనియర్ హీరోయిన్ శ్రీయ బాలకృష్ణతో చెన్నకేశవరెడ్డి సినిమాలో నటించగా.. అలాగే ఎన్టీఆర్ తో నా అల్లుడు అనే సినిమాలో నటించినది.

కాజల్ , చిరంజీవి , రామ్ చరణ్:
ప్రముఖ హీరోయిన్ కాజల్ చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటించగా.. రామ్ చరణ్ తో నాయక్, గోవిందుడు అందరివాడేలే వంటి సినిమాలలో నటించింది.

శృతిహాసన్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్:
శృతిహాసన్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమాలో చేసి, ఆ తర్వాత రామ్ చరణ్ తో ఎవడు సినిమాలో నటించింది.

త్రిష ,బాలకృష్ణ, ఎన్టీఆర్:
ప్రముఖ సీనియర్ హీరోయిన్ త్రిష బాలకృష్ణతో లయన్ సినిమాలో నటించి.. ఎన్టీఆర్ తో దమ్ము సినిమాలో నటించింది.

అనుష్క, వెంకటేష్ , రానా:
అనుష్క వెంకటేష్ తో చింతకాయల రవి సినిమాలో నటించగా.. రానాతో రుద్రమదేవి సినిమాలో నటించింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు