SHRUTI HAASAN: శృతి సరసాలు?

తెలుగుపరిశ్రమలో శృతిహాసన్ క్రేజ్ మామూలుగా లేదు. కమల్ హాసన్ కూతురుగా అడుగుపెట్టి ఆనతి కాలంలోనే తనకంటూ సొంతంగా కష్టపడి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఈ హీరోయిన్ సందడి అంతా ఇంతా కాదు. ఈ ఏడాది వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది శృతిహాసన్. ప్రస్తుతం ఆమె ప్రభాస్ సరసన సలార్ లో నటిస్తోంది.

 

కేజిఎఫ్ సిరీస్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటోంది. తన ప్రియుడుతో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈ కోలీవుడ్ భామ శాంతను హజారికా తో ఉన్న వీడియోను తన ఇన్స్టాలో పంచుకుంది. అది కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

- Advertisement -

 

ఇలాంటి వీడియోలతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని మండిపడుతున్నారు. మరికొందరేమో దారుణమైన కామెంట్స్ చేశారు. శృతిహాసన్ తన ఇన్ స్టాలో వీడియో షేర్ చేస్తూ, ‘శాంతను తిరిగి ఇంటికి వచ్చాడు. అతను నా జీవితంలోకి వచ్చాక శాశ్వతంగా మార్చేశాడు’. అంటు శాంతనుకు ముద్దు పెడుతున్న వీడియోను పోస్ట్ చేసింది. అది చూసిన నెటిజన్లు దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాతో రొమాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేయడం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

 

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు