Chennai Story : సమంతను రీప్లేస్ చేసిన శృతిహాసన్… క్రేజీ ప్రాజెక్ట్ చేజర్చుకున్న సామ్

శృతిహాసన్ కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. ప్రస్తుతం పాన్ ఇండియా నుంచి రీజనల్ సినిమా దాకా హీరోలకు బెస్ట్ ఛాయిస్ శృతిహాసనే. గత ఏడాది “సలార్” సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించి, మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది శృతి. ఆమె చేతిలో ప్రస్తుతం మూడు నాలుగు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే “చెన్నై స్టోరీ” అనే సినిమాలో సమంత చేయాల్సిన పాత్రను కొట్టేసి, మరో అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకుంది శృతిహాసన్.

హ్యాట్రిక్ ప్లాపులు అందుకున్న తర్వాత సమంత అనారోగ్య కారణాలతో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. గతేడాది నుంచి ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉంటూ, తనకున్న మయోసైటిస్ జబ్బుకు చికిత్స తీసుకుంటుంది. ఈ అమ్మడు సినిమా నుంచి అలా బ్రేక్ తీసుకోవడమే ఇప్పుడు శృతిహాసన్ కు కలిసి వచ్చింది. సామ్ హీరోయిన్ గా చేయాల్సిన “చెన్నై స్టోరీ” మూవీ తాజాగా శృతిహాసన్ ఖాతాలో పడిపోయింది. వాస్తవానికి 2021 నవంబర్లో సమంత ఈ ఇండో బ్రిటిష్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టుగా ప్రకటించింది. డౌన్ టౌన్ అబ్బే డైరెక్టర్ ఫిలిప్ జాన్ తో కలిసి సినిమా చేయబోతున్న విషయాన్ని సమంత ఆయనతో దిగిన ఫోటోలు షేర్ చేసి మరీ వెల్లడించింది. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సమంత చేయి జారి శృతిహాసన్ ను వరించింది.

“చెన్నై స్టోరీ” మూవీ “ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ అనే నవల ఆధారంగా రూపొందుతోంది. టైమ్రి ఎన్ మురారి రాసిన ఈ నవల 2024 లో అత్యధికంగా అమ్ముడైన నవలగా రికార్డును క్రియేట్ చేసింది. డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతున్న ద్విలింగ సంపర్క తమిళ యువతి కథ “ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్”. కనిపించకుండా పోయిన తన తండ్రిని వెతికే ఓ వ్యక్తిగా వివేక్, అతనికి హెల్ప్ చేసే డిటెక్టివ్ అను పాత్రలో శృతిహాసన్ కనిపించబోతున్నారు. వేల్స్ తో పాటు ఇండియాలో జరిగే ఈ రొమాంటిక్ కామెడీ మూవీ కేవలం ఇంగ్లీష్ లోనే కాకుండా కొంచెం తమిళం, మరి కొంచెం వెల్ష్ భాషలో ఉంటుంది. సునీత తాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా సమంతను అనుకున్నారు. ప్రస్తుతం ఆమె సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవడంతో ఆమె స్థానంలో శృతిహాసన్ ను తీసుకుని, ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లాలని మేకర్స్ డిసైడ్ అయినట్టు సమాచారం.

- Advertisement -

ప్రస్తుతం శృతిహాసన్ చేతిలో “డెకాయిట్” అనే ద్విభాషా చిత్రం, “ది ఐ” అనే బ్రిటిష్ సైకలాజికల్ థ్రిల్లర్, “చెన్నై స్టోరీ” సినిమాలు ఉన్నాయి. ఇంకా ఈ బ్యూటీ కన్నడ స్టార్ హీరో యష్ తో కలిసి “టాక్సిక్” అనే పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్నట్లు రూమర్స్ ఉన్నాయి. ఈ మూవీలో శృతిహాసన్ పాత్ర గురించి మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు