Devi Sri Prasad : దేవిశ్రీ ఈజ్ బ్యాక్… రాక్ స్టార్ లైనప్ లో ఎన్ని సినిమాలంటే?

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మళ్లీ తిరిగి ఫామ్ లోకి వచ్చారు. ప్రస్తుతం చేతిలో అరడజనుకు పైగా క్రేజీ ప్రాజెక్టులతో సైలెంట్ గా బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టారు దేవిశ్రీ. మరి ప్రస్తుతం ఆయన ఖాతాలో ఉన్న ప్రాజెక్టులు ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

2021లో ఉప్పెన, పుష్ప వంటి సినిమాలతో సత్తా చాటిన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కు 2022 అస్సలు కలిసి రాలేదు. ఆ ఏడాది ఆయన ఏకంగా 8 సినిమాలు చేసినప్పటికీ కనీసం ఒక్క హిట్ కూడా పడలేదు. దీంతో డిఎస్పి పనైపోయిందని అంతా అనుకున్నారు. 2023లో “వాల్తేరు వీరయ్య” సినిమాతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యారు డిఎస్పి. ఇక “పుష్ప” సినిమాతో ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకుని అందరి దృష్టిలోనూ పడ్డారు ఈ రాక్ స్టార్. దీంతో పలు క్రేజీ ప్రాజెక్టులు ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఖాతాలో పడిపోవడంతో, గతంలోలాగే డిఎస్పి మళ్లీ ఫుల్ బిజీ అయిపోయారు. ప్రస్తుతం దేవిశ్రీ చేతిలో ఉన్న సినిమాల్లో ముఖ్యమైనది “పుష్ప 2”. “పుష్ప 1″కు ఆయన అందించిన సంగీతం ఏ రేంజ్ లో మార్మోగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు మ్యూజిక్ పరంగా “పుష్ప 2″పై భారీ అంచనాలు ఉన్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాకి డిఎస్పీనే మ్యూజిక్ డైరెక్టర్. కేవలం మెగా ప్రాజెక్టులు మాత్రమే కాదు అక్కినేని హీరోల ఫ్యూచర్ సినిమాలు కూడా డిఎస్పీ చేతుల్లోనే ఉన్నాయి. అక్కినేని నాగచైతన్య, చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న కోస్టల్ బ్యాక్ డ్రాప్ మూవీ “తండేల్” సినిమాకు, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, ధనుష్ కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ పాన్ ఇండియా సినిమాకు కూడా డిఎస్పీనే మ్యూజిక్ డైరెక్టర్. విశాల్ కొత్త చిత్రం “రత్నం” సినిమాకు దేవిశ్రీనే సంగీతం అందించబోతున్నారు. అజిత్ కుమార్ నెక్స్ట్ మూవీ AK63కి కూడా దేవినే మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఆయన చేతిలో దాదాపుగా అరడజను సినిమాలు ఉండగా, అందులో కొన్ని ఈ ఏడాదే రిలీజ్ అవుతుండడం విశేషం. డీఎస్పీ చేతిలో ఉన్న ఈ క్రేజీ లైనప్ చూస్తే ఇతర మ్యూజిక్ డైరెక్టర్లకు అసూయ పుట్టడం ఖాయం. మరి చేతిలో ఉన్న ఈ సినిమాలతో చాట్ బస్టర్ ఆల్బమ్స్ అందించి, మరోసారి దేవిశ్రీ ప్రసాద్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోతారా అంటే వెయిట్ అండ్ సీ.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు