Rebel Star: ప్రభాస్ ఫ్యాన్స్ కి షాక్ – ఆ సినిమా క్యాన్సిల్..!

రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు లైనప్ లో పెట్టిన సంగతి తెలిసిందే. కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉండగా మరికొన్ని సినిమాలు ఇంకా మొదలవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా విడుదలకి సిద్ధంగా ఉండగా ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు ప్రభాస్. జూన్ 16న ఆదిపురుష్ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేసారు మేకర్స్. ఈ సినిమా రిలీజ్ అయ్యాక సలార్, ప్రాజెక్ట్ కే సినిమాల షూటింగ్ లో పాల్గొననున్నాడు ప్రభాస్. అంతే కాకుండా డైరెక్టర్ మారుతితో ఓ సినిమా కూడా ప్లాన్ చేసాడు, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోన్న ఆ సినిమా త్వరలోనే మొదలవనుందని సమాచారం.

మైత్రి మూవీస్ బ్యానర్ పై పఠాన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో కూడా సినిమా ప్లాన్ చేసాడు ప్రభాస్. అయితే, ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్టు సమాచారం అందుతోంది. ప్రస్తుతం డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ ఫైటర్ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండటమే ప్రభాస్ సినిమా క్యాన్సిల్ అవ్వటానికి కారణం అని తెలుస్తోంది.

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసిన ఈ సినిమాకు సంబంధించి 75కోట్ల రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారట మేకర్స్. డైరెక్టర్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల నిర్మాతలు ఈ సినిమాని కొన్నాళ్ళు పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యారట. ప్రస్తుతం డైరెక్టర్ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ అన్ని పూర్తయ్యాక ప్రభాస్ కోసం కథ సిద్ధం చేస్తే అప్పుడు సినిమా మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు.ఈ క్రమంలో క్రేజీ కాంబినేషన్లో పాన్ ఇండియా వైడ్ ప్లాన్ చేసిన తమ హీరో సినిమా క్యాన్సిల్ కావటం పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు