Ugram: ఆ హీరోతో శ్రీను వైట్ల సినిమా – కమ్ బ్యాక్ ఇస్తాడా..?

నీకోసం సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి, వెంకీ, ఢీ, రెడీ, దూకుడు వంటి బ్లాక్ బస్టర్స్ అందుకొని టాప్ డైరెక్టర్ గా కొనసాగిన శ్రీనువైట్ల కొన్నేళ్లుగా వరుస డిజాస్టర్స్ తో నిరాశ పరుస్తున్నాడు. గత చిత్రం అమర్ అక్బర్ ఆంటోని కూడా డిజాస్టర్ అవటంతో 2018 నుండి మరో సినిమా చేసే అవకాశం రాలేదు. ఆ మధ్య మంచు విష్ణు హీరోగా ఢీ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడని వార్తలొచ్చాయి. అయితే, కొంత భాగం షూటింగ్ పూర్తయ్యాక ఆ సినిమా ఆగిపోయిందని సమాచారం అందుతోంది. ప్రస్తుతం హీరో నరేష్ తో శ్రీను వైట్ల సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

ఈ మధ్య కామెడీ సినిమాలకు స్వస్తి చెప్పి వరుసగా సీరియస్ కథాంశం ఉన్న సినిమాలు చేస్తున్న నరేష్ ఇటీవల విడుదలైన ఉగ్రం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పట్లో కామెడీ సినిమాలు చేయాటం కష్టంగా మారిందని, ఎవరైనా సరైన స్క్రిప్ట్ తీసుకొస్తే కామెడీ సినిమా చేయటానికి రెడీ అంటూ కామెంట్ చేశాడు. నరేష్ హీరోగా ఇటీవల విడుదలైన ఉగ్రం సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. ఈ క్రమంలో శ్రీను వైట్ల నరేష్ కోసం కథని సిద్ధం చేసే పనిలో పడ్డాడని టాక్ వినిపిస్తోంది.

అయితే, ఇప్పటికి వరకు మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలతోనే సినిమాలు చేసిన శ్రీను వైట్ల నరేష్ తో సినిమా చేస్తాడా అన్నది ప్రశ్నగా మారింది. కమర్షియల్ ఎంటర్టైనర్స్ కి ప్రసిద్ధి చెందిన శ్రీనువైట్ల సినిమాల్లో కామెడీ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. నరేష్ కోసం శ్రీనువైట్ల ఎలాంటి కథని సిద్ధం చేస్తాడు, కామెడీ సినిమాలు చేయటం మానేసిన నరేష్ శ్రీనువైట్ల తో కామెడీ సినిమా చేయటానికి రెడీ అవుతాడా అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంతవరకు వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు