Tollywood: మెగాస్టార్, సూపర్ స్టార్ మధ్యలో టిల్లు – నెగ్గేదెవరో..!

మెహర్ రమేష్ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న విడుదలకి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ చిరుకి చెల్లెలుగా నటిస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా మెగాస్టార్ సరసన హీరోయిన్ గా నటించింది. తమిళ్ సినిమా వేదాళం కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాకి మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మే డే సందర్బంగా సినిమా యూనిట్ రిలీజ్ చేసిన చిరంజీవి పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. కలకత్తాలో టాక్సీ డ్రైవర్ గా ఉన్న చిరంజీవి ఫోటోలు చుసిన ఫ్యాన్స్ చూడాలని ఉంది సినిమాని గుర్తు చేసుకుంటున్నారు.

ఇదిలా ఉండగా భోళా శంకర్ సినిమాకి పోటీగా ఆగస్టు 10న సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా కూడా రిలీజ్ అవబోతోంది. నీల్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆగస్టు 10న విడుదల చేస్తున్నట్టు ఇటీవలే సినిమా యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి ఆ మధ్య విడుదలైన గ్లిమ్ప్స్ లో రఫ్ లుక్ తో రజినీ కనిపించటంతో సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి.

ఈ ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలకు పోటీగా సిద్దు జొన్నలగడ్డ ఆగస్టులోనే టిల్లు స్క్వేర్ సినిమా ద్వారా పోటీకి వస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని ఆగస్టులో రిలీజ్ చేయనున్నట్టు సినిమా యూనిట్ గతంలోనే తెలిపింది. ఇండిపెండెన్స్ డే ని టార్గెట్ చేస్తూ ఇప్పటికే చిరంజీవి, రజినీకాంత్ లు 10, 11 తేదీలను లాక్ చేయగా సిద్ధూ కూడా అదే సమయంలో 12కి గనక టిల్లు స్క్వేర్ ని రిలీజ్ చేస్తే పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఈ ముగ్గురిలో తగ్గేదెవరో, నెగ్గేదెవరో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు