Sharwanand : గ్యాప్ ని భర్తీ చేయడానికి శర్వా రిస్క్?

Sharwanand : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన శర్వానంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్ళలో అన్ని రకాల పాత్రలు చేస్తూ ఆడియన్స్ ని మెప్పించిన శర్వా, గమ్యం, ప్రస్థానం లాంటి సినిమాలతో హీరోగా ప్రత్యేక ఇమేజ్ ని తెచ్చుకున్నాడు. ఆ తర్వాత రన్ రాజా రన్, శతమానం భవతి లాంటి బ్లాక్ బస్టర్స్ తో ఇండస్ట్రీ లో మీడియం రేంజ్ హీరోగా ఎదిగాడు. వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ హీరో కోవిడ్ తర్వాత స్పీడ్ తగ్గించాడు. ఇక చివరగా రెండున్నరేళ్ల కింద ‘ఒకే ఒక జీవితం’ అనే హిట్టు సినిమాతో పలకరించిన శర్వా ఆ తర్వాత పెళ్ళిచేసుకుని కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. అయితే తాజాగా వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టి మళ్ళీ బిజీ అయ్యాడు. ఇక ఆల్రెడీ శ్రీ రామ్ ఆదిత్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘మనమే’ షూటింగ్ ఆల్రెడీ జెట్ స్పీడ్ లో జరుగుతుంది. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే తన తదుపరి సినిమాలని కూడా లైన్లో పెట్టాడు.

ఒకేసారి నాలుగు సినిమాల్లో.. రిస్క్?

అయితే శర్వానంద్ హీరోగా నటిస్తున్న 35 వ చిత్రంగా మనమే తెరకెక్కుతుండగా, శర్వాకు అవకాశాలకైతే లోటు లేదు కాబట్టి, వరుస గా మరో మూడు క్రేజీ ప్రాజెక్టులు లైన్లో పెట్టాడు. ‘మనమే’ అనే సినిమా కాకుండా, ‘లూజర్ సిరీస్ దర్శకుడు అభిలాష్ రెడ్డితో ఓ చిత్రం, ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజుతో మరో సినిమా అనౌన్స్ చేశాడు. ఈ మూడు సినిమాలు స్క్రిప్ట్ డెవలెప్మెంట్ దశల్లో ఉండగా ఇప్పుడు శర్వా ఇంకో సినిమాకు రెడీ అయిపోయాడు. ‘ఘాజి’తో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంకల్ప్ రెడ్డితో శర్వా ఓ సినిమా చేయబోతున్నాడట. ఇది పాన్ ఇండియా స్థాయిలో పెద్ద బడ్జెట్లో తెరకెక్కే మూవీ అట. ‘ఘాజి’ తర్వాత ‘అంతరిక్షం’ సినిమాతో నిరాశపరచిన సంకల్ప్, మొన్నామధ్య బాలీవుడ్ హీరో విద్యుత్ జమ్వాల్‌తో ఓటీటీ మూవీ ‘ఐబీ 71’ చేశాడు. అది ఓ మోస్తరు రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు సంకల్ప్ శర్వా తో సినిమా చేయబోతున్నాడట. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే శర్వానంద్ ఈ సినెమాలన్నిటిని ఇదే ఇయర్ మొదలు పెట్టనున్నాడట.

ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికే?

అయితే శర్వానంద్(Sharwanand ) నటిస్తున్న సినిమాల్లో ఆల్రెడీ మనమే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుండగా, సమ్మర్ చివర్లో సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే శర్వానంద్ చేయబోయే మిగతా మూడు సినిమాల షూటింగ్ లని ఇదే ఏడాదిలో ప్రారంభించనున్నాడట. దానికి కారణం పెళ్లి తర్వాత వచ్చిన గ్యాప్ అని సమాచారం. రెండున్నరేళ్ల కింద ఒకే ఒక జీవితం తర్వాత గ్యాప్ ఎక్కువ రావడంతో ఆ గ్యాప్ ని వరుస సినిమాలతో ఫిల్ చేద్దామని ఇతర సినిమాలను కూడా స్టార్ట్ చేసి ఒక సినిమా షెడ్యూల్ ఫినిష్ అవగానే మరో సినిమా షూటింగ్ లో పాల్గొందామని శర్వా భావిస్తున్నాడట. అయితే ఇలా చేయడం వల్ల స్క్రిప్ట్ విషయం లో ఆలోచించే సమయం ఉండదని, మేకింగ్ లో అజాగ్రత్తలు రావచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఒక దర్శకుడికి మూడు నెలల్లో సినిమా పూర్తి చేసే టాలెంట్ ఉంటుంది. మరి కొందరికి కాస్త టైం పడుతుంది. అందరూ ఒకేలా సినిమాలు చేయరు కదా అని నెటిజన్ల భావన. ఏది ఏమైనా ముందు అభిలాష్ రెడ్డి తో సినిమా అయితే స్టార్ట్ చేస్తాడని వార్తలు వస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు