Aishwarya – Jaya Bachchan: బయటపడ్డ అత్తాకోడళ్ళ మధ్య వార్.. కాపురంలో చిచ్చు..!

Aishwarya – Jaya Bachchan: మాజీ విశ్వసుందరి ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్ తో విడిపోతున్నారు అంటూ గత ఏడాది కాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.. దీనికి బలం చేకూర్చేలా కొన్ని సంఘటనలు కూడా జరగడంతో ఈ వార్త వాస్తవమేనా అనే సందేహాలు కూడా అభిమానులలో వ్యక్తం అవుతున్నాయి.. అయితే తాజాగా హోలీ పండుగ రోజు కూడా బచ్చన్ ఫ్యామిలీ అంతా కలిసి హోలీ జరుపుకున్నారు.. అయితే ఈ సంబరాలలో ఐశ్వర్య కనిపించలేదు.. దీంతో అభిషేక్, ఐశ్వర్యాల మధ్య మనస్పర్ధలు రావడం వల్లే ఆమె ఈ వేడుకలలో పాల్గొనలేదు అని.. మళ్లీ ఒక వార్త తెరపైకి వచ్చింది.. అయితే అభిషేక్ – ఐశ్వర్యాల మధ్య మనస్పర్ధలు రావడానికి.. ఐశ్వర్య అత్తగారు జయా బచ్చన్ ప్రధాన కారణమని సమాచారం.

జయా బచ్చన్ తో ఐశ్వర్య విభేదాలు..
ఇకపోతే కొన్ని సంవత్సరాలు క్రితం వరకు కూడా ఐశ్వర్య – జయా బచ్చన్ ల అనుబంధం బాగానే ఉండేది. 52వ ఫిలింఫేర్ అవార్డ్స్ లో జయా బచ్చన్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. అదే సమయంలో ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఐశ్వర్య క్లాప్ కూడా కొట్టి చాలా ఆనందంగా అత్తని అభినందించింది.. అలా దాదాపు 17 సంవత్సరాల వైవాహిక జీవితంలో తన అత్తగారితో ఎంతో అనుబంధంగా కొనసాగిన ఐశ్వర్య.. ఇప్పుడు ఆ బంధాన్ని కొనసాగించలేకపోతోంది..ఈ క్రమంలోనే హోలీ వేడుకల్లో కూడా ఐశ్వర్య తన అత్తతో కనిపించలేదు. కానీ తన భర్త , కుమార్తె, స్నేహితులతో హోలీ జరుపుకుంది.. అందుకే ఈ వివాదం అంతా అత్తా కోడలు మధ్య రాజుకుంది అంటూ విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.. ఇదిలా ఉండగా ఈసారి ఐశ్వర్య తన అత్త పుట్టినరోజు కూడా మరిచిపోయింది. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు కూడా షేర్ చేయలేదు.. పైగా జయా కు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. దీంతో అత్త కోడల మధ్య వివాదాలు మొదలయ్యాయని వార్త చెక్కర్లు కొడుతోంది అయితే అభిషేక్ బచ్చన్ మాత్రం తన తల్లి పాత ఫోటోని పోస్ట్ చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇకపోతే అత్తగారి గొడవలో భర్త కథ ఏంటని నెటిజన్ లు ట్రోల్ చేస్తుండగా.. అభిషేక్ మాత్రం రెండు వైపులా సర్దుకుపోతున్నాడని బాలీవుడ్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఐశ్వర్య – అభిషేక్ మధ్య విభేదాలకు ఈమె కూడా కారణమే..
ఇకపోతే ఐశ్వర్య రాయ్ – అభిషేక్ బచ్చన్ మధ్య విభేదాలు రావడానికి కారణం.. అమితాబ్ బచ్చన్..తన ఇల్లు ప్రతీక్షా బంగ్లాను తన కూతురు శ్వేతాకి బహుమతిగా ఇచ్చిన తర్వాతే వీరి కుటుంబంలో విభేదాలు వచ్చాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి అప్పటినుంచి ఐశ్వర్య మనస్థాపానికి గురైందని బాలీవుడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి.. వాస్తవానికి ఐశ్వర్య , శ్వేతా గతంలో చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు.. అయితే ఈ మధ్యకాలంలో వీళ్ళిద్దరూ కలిసి కనిపించిన దాఖలాలు లేవు.. ఇద్దరు చివరిసారిగా ది ఆర్చీస్ ప్రీమియర్ లో మాత్రమే బహిరంగంగా కలిసి కనిపించారు.. ఈ సినిమా శ్వేత తనయుడు అగస్త్యానంద తొలి చిత్రం.. ఈ కార్యక్రమంలో ఐశ్వర్య అగస్త్యాను ఆటపటించడమే కాదు శ్వేతా కుటుంబంతో కలసి ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చింది..గత ఏడాది అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా కూడా వీరిద్దరూ కలిసి వచ్చారు.. కానీ ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు వీరితో కూడా ఈమె గొడవ పడినట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు