Heroines Education qualification : గ్లామర్ బ్యూటీసే కాదు విద్యావంతులు కూడా..!

Heroines Education qualification.. సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి , చదువుకి ఎటువంటి సంబంధం లేదు. చదువుతో సంబంధం లేకపోయినా అందం అభినయంతో పాటు కూసింత అదృష్టం ఉంటే చాలు హీరోయిన్లుగా రాణించవచ్చని ఇప్పటికే చాలామంది నిరూపించారు.. నిజానికి వెండితెరపై తమ అందచందాలతో ప్రతిభతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ఎంతోమంది హీరోయిన్స్ ప్రతిభావంతులే కాదు విద్యావంతులు అని కూడా తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోక మానదు.. ముఖ్యంగా ఉన్నత చదువులు చదివి.. తమ విద్యను కెరియర్ కి ఉపయోగించుకోకుండా …అందాన్ని ఉపయోగించుకుంటూ గ్లామర్ ఫీల్డ్ లో సెలబ్రిటీలుగా సెటిలైపోయారు. మరి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తమ అందంతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ సెలబ్రిటీలు ఎంతవరకు చదువుకున్నారో ఇప్పుడు చూద్దాం..

అనుష్క శెట్టి:

Anushka
Anushka

సూపర్ సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమైన ఈమె కార్మెల్ కళాశాలలో కంప్యూటర్ అప్లికేషన్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసింది.

నయనతార:

nayanthara
nayanthara

లేడీ సూపర్ స్టార్ నయనతార విద్యాభ్యాసం మొత్తం నార్త్ లోనే జరిగింది. సినిమా కెరియర్ ప్రారంభించక ముందు మార్థోమా కాలేజీలో బీ.ఏ.పూర్తి చేసిన ఈమె ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగుతోపాటు తమిళ్, హిందీ చిత్రాలలో నటిస్తూ భారీ క్రేజ్ దక్కించుకుంది..

- Advertisement -

సమంత:

Samantha
Samantha

ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్గా చలామణి అవుతున్న ఈ అమ్మడు కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసింది .

తమన్నా:

Tamanna
Tamanna

మిల్క్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న తమన్న ముంబైలోని మానెక్ జీ కూపర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్కూల్లో చదివి, ఆ తర్వాత ఆర్ట్స్ లో పట్టా పొందింది. ఇక గ్లామర్ ఫీల్డ్ లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ దాదాపు 18 సంవత్సరాలు అవుతున్నా.. ఇంకా స్టార్ హోదా అనుభవిస్తూ భారీ పాపులారిటీ దక్కించుకుంది.

త్రిష:

Trisha
Trisha

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు 20 సంవత్సరాలవుతున్నా.. ఇంకా అదే హోదాతో వరుస సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు సౌత్ సీనియర్ హీరోలకి కూడా కేరాఫ్ అడ్రస్ గా మారిన విషయం తెలిసిందే.ఇక త్రిష విద్యాభ్యాసం విషయానికి వస్తే చెన్నైలోనే ఉమెన్స్ కాలేజీలో బీబీఏ పూర్తి చేసింది.

కాజల్ అగర్వాల్..

kajal aggarwal
kajal aggarwal

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లోకి లక్ష్మీ కళ్యాణం అనే సినిమా ద్వారా అడుగుపెట్టి.. ఆ తర్వాత చందమామ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ అందుకొని ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్న కాజల్ అగర్వాల్.. ముంబైలోని కేసీ కళాశాలలో మాస్ మీడియా కమ్యూనికేషన్ లో మార్కెటింగ్ విభాగంలో పట్టా పొందింది.

సాయి పల్లవి..

Sai Pallavi
Sai Pallavi

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను ఫిదా చేసిన ఈ అమ్మడు TBILES స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుండి ఎంబిబిఎస్ పూర్తి చేసింది.. ఈమె ఒక డాక్టర్ అయినా సరే నటనపై ఆసక్తితో వైద్యవృత్తిని కాదని నటిగా మారింది. ప్రస్తుతం బాలీవుడ్ లో హిందీ రామాయణంలో నటిస్తోంది.

రకుల్ ప్రీత్ సింగ్:

Rakul preet Singh
Rakul preet Singh

జీసస్ అండ్ మేరీ కాలేజీలో చదివిన ఈమె ఢిల్లీ యూనివర్సిటీలో గణిత విద్యను అభ్యసించింది.

శృతిహాసన్ సైకాలజీ పూర్తి చేయగా.. పూజా హెగ్డే M.Com పూర్తి చేసింది. ఇక రష్మిక మందన్న సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. నిధి అగర్వాల్ బిజినెస్ మేనేజ్మెంట్ లో డిగ్రీ పూర్తి చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు