Prabhas: వైలన్స్ కి కేరాఫ్ గా సలార్.. ఊచకోత కి రెఢీ..!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’ సినిమా రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ అభిమానుల్లో ఆతృత పెరిగిపోతుంది. కామన్ ఆడియన్స్ సహా డార్లింగ్ ప్రభాస్ ఈ సినిమాతో మాస్ కం బ్యాక్ ఇస్తాడని ఆశిస్తున్నారు. అయితే డిసెంబర్ 22 న రిలీజ్ అవుతున్న సలార్ రిలీజ్ డేట్ కి రెండు వారాల టైం కూడా లేకపోవడంతో మూవీ టైం కి రిలీజ్ అవుతుందా లేదా అని ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేసారు. కానీ తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం చిత్ర యూనిట్ ఎక్కడా రెస్ట్ తీసుకోకుండా సినిమా రిలీజ్ డేట్ కల్లా మూవీని రెడీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇక తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సలార్ ఆల్రెడీ సెన్సార్ కి కూడా వెళ్లిందట. అయితే సలార్ సినిమాకి ఎవ్వరూ ఊహించని విధంగా క్లీన్ ‘A’ సర్టిఫికెట్ వచ్చిందని టాక్ నడుస్తుంది. మూవీ టైం 2 గంటల 55 నిముషాలు కాగా, సినిమాలో వైలెన్స్ భీభత్సంగా ఉంటుందని, ఇంతకు ముందు వచ్చిన ప్రభాస్ సినిమాల అన్నిటికంటే ఎక్కువ వైలెన్స్ ఈ సినిమాలో ఉంటుందని సెన్సార్ బోర్డు నుంచి సమాచారం వచ్చింది. ఓవరాల్ గా సలార్ సినిమా టాలీవుడ్ లో వైలెన్స్ కి కేరాఫ్ గా మారుతుందని నెటిజన్లు అంటున్నారు.

అయితే సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలకి అసలు స్కోపే లేదట. పైగా హీరోయిన్ రోల్ కి కూడా తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందట. అయితే ఏది ఏమైనా సరైన హిట్ కోసం ఆరేళ్లుగా ఆకలిమీదున్న ప్రభాస్ ఫ్యాన్స్. సలార్ సినిమా మాత్రం వాళ్లకి ఫుల్ మీల్స్ లా కాకుండా ఏకంగా బిర్యానీ రుచి చూపించేలా సినిమాని రెడీ చేసారని ట్రేడ్ వర్గాల నుండి సమాచారం వచ్చింది. అయితే సెన్సార్ బోర్డు నుండి అఫిషియల్ గా ఇంకా డీటెయిల్స్ ఇవ్వలేదు. ఇక సలార్ సినిమా రిలీజ్ అయితే చాలు ఫస్ట్ డే రికార్డులు బ్రేక్ ఇవ్వడానికి, బాక్స్ ఆఫీస్ ఊచకోతకు రెడీ అవుతుందని ఫ్యాన్స్ ఇప్పట్నుంచే ట్రెండ్ చేయడానికి ప్రిపేర్ అయ్యారు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు