Sandeep: ఛాన్స్ ఇస్తే చిరంజీవితో అలాంటి సినిమా చేస్తా – సందీప్ వంగా..!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగినటువంటి హీరో చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో చిత్రాలలో నటనతో, డాన్స్ తో, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను సంపాదించుకున్నారు చిరంజీవి. అంతేకాదు తన కుటుంబం నుంచి కూడా ఎంతోమంది నటులు చిరంజీవిని ఇన్స్పైర్గా తీసుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే చాలామంది నటీనటులు కూడా చిరంజీవిని చూసే ఇన్స్పైర్గా వచ్చామని ఎన్నో సందర్భాలలో తెలియజేశారు. ఇదిలా వుండగా చాలామంది డైరెక్టర్లు కూడా అవకాశం వస్తే చాలు చిరంజీవితో సినిమా చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఇటీవల బాగా పాపులారిటీ సంపాదించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చిరంజీవితో సినిమా తీయడానికి చాలా ఆతృతగా ఉన్నట్లు తెలుస్తోంది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

చిరంజీవి రీసెంట్గా భోళా శంకర్ చిత్రంలో నటించి ఘోరమైన డిజాస్టర్ ని మూటకట్టుకోవడమే కాకుండా ట్రోలింగ్ కి కూడా గురయ్యారు. అందుకే తన తదుపరి చిత్రాన్ని రీమిక్స్ సినిమా కాకుండా డైరెక్టర్ వశిష్ట తో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. అందుకు సంబంధించి షూటింగ్ కూడా జరుగుతోంది. ఇలా సరికొత్త కథాంశంతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైన చిరంజీవి తనకు అవకాశం వస్తే ఖచ్చితంగా చిరంజీవితో సినిమా చేయగలుగుతానంటూ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా 600 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ సినిమా అయిపోయిన వెంటనే ప్రభాస్ తో స్పిరిట్ సినిమాని చేయాలనుకుంటున్నారు. అలాగే మహేష్ బాబుతో ఒక సినిమా కూడా చేయాలని ఆత్రుతగా ఉన్న డైరెక్టర్ సందీప్ రెడ్డికి చిరంజీవి ఈ గ్యాప్ లో తనకు డేట్లు అడ్జస్ట్ చేస్తే ఖచ్చితంగా మంచి యాక్షన్ సినిమా ఉంటుందని తెలియజేశారు.

- Advertisement -

అభిమానులు కూడా వీరి కాంబినేషన్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎంతోమంది యంగ్ డైరెక్టర్లకు కూడా చిరంజీవి అవకాశాలని ఇస్తూ ఉన్నారు. మరి ఈ విషయం పైన చిరంజీవి ఎలా స్పందిస్తారో చూడాలి మరి.. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న చిరంజీవి మళ్లీ అలాంటి విజయం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ వశిష్ట తో సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఏ మేరకు ఈ సినిమా అభిమానులను మెప్పిస్తుందో చూడాలి మరి.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు