BiggBoss7 : పాపం.. సీరియల్ బ్యాచ్ కోసం ఆ టాప్ కంటెస్టెంట్ బలి..!

తెలుగు ప్రేక్షకులను ఎప్పటినుంచో అలరిస్తున్న బిగ్గెస్ట్ వరల్డ్ రియాల్టీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకత చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. ఈ ఏడాది సెప్టెంబర్ 3న ఏడో సీజన్ కూడా మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు ఈ సీజన్ కూడా చివరి దశకు చేరుకుంది. 13వ వారం ఎలిమినేషన్ లో భాగంగా గౌతమ్ ఇంటి నుంచి వెళ్లిపోగా.. ఇక 14వ వారం ఎలిమినేషన్ లో భాగంగా సీరియల్ బ్యాచ్ ను కాపాడడానికి బిగ్ బాస్ మరో టాప్ కంటెస్టెంట్ ను బలి చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే ఈసారి ఎలిమినేషన్ కోసం కాకుండా టైటిల్ విన్నర్ కోసం ఓటింగ్ పోల్స్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే అందులో ఎవరికి తక్కువ ఓటింగ్ వస్తే వారు ఎలిమినేట్ అవుతారు. ఈ వారం 14వ వారం కాబట్టి ఒకరు ఇంటి నుంచి ఎలిమినేట్ అవుతుండగా.. 15వ వారం మధ్యలో మరొకరిని ఎలిమినేట్ చేయనున్నారు. ఇక డిసెంబర్ 17వ తేదీన ఫినాలే జరగబోతుందని సమాచారం. మరి ఈ వారం ఓటింగ్ విషయానికి వస్తే. ఎప్పటిలాగే పల్లవి ప్రశాంత్ కి ఎక్కువ ఓటింగ్ వస్తోంది . 41.39% ఓట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక 17.68%తో శివాజీ రెండో స్థానంలో ఉండగా.. మూడో స్థానంలో యావర్, నాలుగో స్థానంలో అమర్దీప్ ఉన్నారు. ఈ అనధికార సర్వే ని చూస్తే పల్లవి ప్రశాంత్ కి టైటిల్ విన్నర్ గా ట్రోఫీ వచ్చే అవకాశం మెండుగా ఉందని సమాచారం.

ఇకపోతే ఐదవ స్థానంలో అర్జున్, ఆరో స్థానంలో ప్రియాంక, ఏడో స్థానంలో శోభా శెట్టి ఉన్నారు. ఇక మరొకసారి శోభా శెట్టిని బిగ్ బాస్ ఎలిమినేషన్ నుంచి కాపాడతాడు అంటూ నెటిజన్ లు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే శోభా శెట్టిని సేవ్ చేయడానికి టాలెంటెడ్ కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకున్న యావర్ ను ఇంటి నుంచి ఎలిమినేట్ చేస్తారనే వార్త ఇప్పుడు నెట్ వైరల్ గా మారింది. ఒకవేళ ఈవారం ఎలిమినేట్ కాకపోయినా వచ్చేవారం మిడ్ వీక్ లో ఎలిమినేషన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని సమాచారం. ఇక మరోవైపు ఈసారి ఓటింగ్లో కీలక మార్పులు జరిగాయి. నాగార్జున కూడా ఈ సీజన్ గతంలో మాదిరి ఉండదని.. అంతా ఉల్టా ఫుల్టా ఉంటుందని.. మొదటి నుంచే చెబుతున్నారు. మరి ఈ సీరియల్ బ్యాచ్ ను కాపాడడానికి యావర్ ను బలి చేస్తున్నారనే వార్తలు మరింత వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు