Sai Pallavi: స్మైల్.. హోప్.. గ్రాటిట్యూడ్ ఉంటే చాలు

లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ తమిళ బ్యూటీ సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు.. టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ అనే పవర్ ఫుల్ ట్యాగ్ ను కూడా సొంతం చేసుకుంది. కాగా సాయి పల్లవి కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించి, హీరోయిన్ గా ఎదిగింది.

ఈమె తన తొలి సినిమా ప్రేమమ్. ఇది మలయాళం భాషలో వచ్చింది. దీనిలో లీడ్ రోల్ తో పాటు కొరియోగ్రాఫర్ గా కూడా చేసింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగులోకి ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అచ్చం తెలుగు అమ్మాయిలా కనిపించడంతో, తెలుగు ప్రేక్షకులు ఈ తమిళ భామను ఓన్ చేసుకున్నారు. దీంతో కొద్ది రోజుల్లోనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అయిపోయింది.

సాయి పల్లవి నుంచి ఇటీవల వచ్చిన విరాటపర్వం,గార్గి విజయాన్ని దక్కించుకోకపోయినా, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాయి. ఈమె నటనకు కూడా మంచి పేరు వచ్చింది. అయితే ఈ సినిమాల తర్వాత సాయి పల్లవి ఎక్కడా కనిపించడం లేదు. గర్గి తర్వాత ఈమె ఇప్పటి వరకు ఒక సినిమాకు కూడా సైన్ చేయలేదు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ లేడీ పవర్ స్టార్, ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా కనిపించడం లేదు.

- Advertisement -

జనవరి 1వ తేదీన ఓ గుడిలో ధ్యానం చేస్తూ కెమెరా కంట చిక్కింది. ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. తాజాగా చాలా రోజుల తర్వాత సాయి పల్లవి తన ఇన్ స్టాగ్రామ్ లో మెరిసింది. నవ్వుతూ ఉన్న ఒక ఫోటోను షేర్ చూస్తూ నవ్వు.. హోప్ మరియు గ్రాటిట్యూడ్ తన జీవితంలో ఉంటే చాలు అన్నట్టు ఒక క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుండగా, తన క్యాప్షన్ తో సాయి పల్లవి వార్తల్లోకి ఎక్కింది.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు