Pushpa : ఇప్పుడు లేడీ పవర్ స్టార్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత ఏడాది వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలోని డైలాగ్స్, డ్యాన్స్, పాటలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అల్లు అర్జున్ కు బిగ్ హిట్ అందించింది. కాగా దీనికి కొనసాగింపుగా పుష్ప2 ను సుకుమార్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పుష్ప2 కోసం భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పుష్ప2 కు మరింత క్రేజ్ తీసుకురావడానికి చిత్ర యూనిట్ చూస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమాలో స్టార్ నటీనటులను ఎంపిక చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే మలయాళ నటుడు ఫహద్ ఫజిల్, రష్మికా మందన్నా, అనసూయ ఈ చిత్రంలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో సాయి పల్లవిని ఎంపిక చేసే పనిలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం అందుతుంది.

పుష్ప2 లో ఒక కీలక పాత్రకు సంబంధించి సాయి పల్లవిని డైరెక్టర్ సుకుమార్ సంప్రదించారట. అలాగే కథను కూడా వినిపించారట. స్టోరీ బాగా నచ్చడంతో పుష్ప రాజ్ సినిమాలో నటించడానికి సాయి పల్లవి ఒకే చేసిందని టాక్ వినిపిస్తుంది. అయితే పుష్ప2లో సాయి పల్లవి హీరోయిన్ పాత్రనా, లేదా ఇతర పాత్రనా అనేది మాత్రం క్లారిటీ లేదు. అయితే పుష్ప2లో సాయి పల్లవి నటించడంపై మూవీ యూనిట్ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు