Rana Naidu: భారీగా రెమ్యునరేషన్ తీసుకున్న వెంకీ మామా, రానా ?

దగ్గుబాటి హీరోలు వెంకటేష్ – రానా కలిసి నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో మార్చి 10 నుండి స్ట్రీమింగ్ లోకి వచ్చింది. అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ ” రే డోనోవన్” ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ లో మొత్తం పది ఎపిసోడ్ లు ఉండగా.. ఒక్కో ఎపిసోడ్ 45 – 50 నిమిషాల నిడివిని కలిగి ఉన్నాయి. ఇక ఈ సిరీస్ తెలుగు, హిందీ తో పాటు తమిళ్, మలయాళం, స్పానిష్ భాషల్లో అందుబాటులో ఉంది.

ఈ వెబ్ సిరీస్ కి కరణ్ అన్షుమాన్ – సూపర్న్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ కథ అప్పుడప్పుడు హైదరాబాద్ నేపథ్యాన్ని టచ్ చేసినప్పటికీ, ముంబై నేపథ్యంలోనే ఎక్కువగా నడుస్తుంది. అక్కడి సెలబ్రిటీల లైఫ్ స్టైల్ ను ఆవిష్కరిస్తూ ముందుకు వెళ్లారు. రానా నాయుడు వెబ్ సిరీస్ ను ఫ్యామిలీతో కలిసి చూడొద్దని వెంకటేష్ – రానా ప్రమోషన్స్ లో చెప్పారు. కేవలం బూతు డైలాగ్స్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకొని అలా చెప్పి ఉంటారు అనుకుంటే పొరపాటే.

అడల్ట్ తరహా సన్నివేశాలను చూపించడంలోనూ ఎంత మాత్రం తగ్గలేదు. అందువలన ఈ వెబ్ సిరీస్ ను ఎవరి ఫోన్లో వారు ఒంటరిగా చూడడమే బెటర్. అయితే ఈ సిరీస్ లో నటించినందుకుగాను వెంకీ మామ పారితోషకంగా ఎంత తీసుకున్నారు? రానా ఎంత అందుకున్నాడనే విషయంలో సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతుంది. రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటించేందుకు వెంకటేష్ దాదాపు రూ. 12 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే రానా కూడా రూ. 8 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు