OSCAR: నాటు నాటు కి హాలీవుడ్ అందం

రాజమౌళి దర్శకత్వం వహించిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు వచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా 2022 లో అన్ని భాషల్లోనూ రిలీజై ఎన్నో సంచలనాలను క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1250 కోట్లను కలెక్ట్ చేసి, తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. తాజాగా ఈ సినిమా ఎన్నో అవార్డ్స్ ను సొంతం చేసుకుంటుంది. అలాగే చిత్రం లో ఉన్న ‘నాటు నాటు’ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ పై చాలా మంది సెలెబ్రిటీస్ కూడా డాన్స్ చేసారు.

ఈ సాంగ్ అంతర్జాతీయంగా అనేక అవార్డులను గెలుచుకుంటుంది. ఇటీవల నాటు నాటు సాంగ్ ఆస్కార్స్ ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ క్యాటగిరీ లో నామినేట్ అయింది. నాటు నాటుకు దాదాపు 90 శాతం ఆస్కార్ గ్యారంటీ అని హాలీవుడ్ ప్రముఖులు కూడా చెబుతున్నారు. ఇలా తెలుగు పాట కి ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డ్ వరకు వెల్లడం, హాలీవుడ్ సినీ ప్రముఖుల మన్ననులు గెలుచుకోవడం తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు దేశానికే చాలా గర్వపడే విషయం అని చెప్పుకోవచ్చు.

ఇది ఇలా ఉంటే ఈ పాట కి ఆస్కార్స్ లో తారక్ మరియు రామ్ చరణ్ డాన్స్ చేస్తారని గతంలో రూమర్స్ వచ్చాయి. కానీ తారక్, తాము ఎలాంటి ప్రదర్శన చెయ్యట్లే అని క్లారిటీ ఇచ్చేసారు. ఇది ఇలా ఉండగా, హాలీవుడ్ డాన్సర్ లారెన్ గొత్తిలేబ్ తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తానే ఆస్కార్స్ వేదికపై నాటు నాటు సాంగ్ మీద ఫర్మామెన్స్ చెయ్యబోతున్నట్టు అనౌన్స్ చేసింది.

- Advertisement -

ఆస్కార్ వేదికపై ఈ సాంగ్ మీద డ్యాన్స్ చేసే అవకాశం లభించడం చాలా ఆనందంగా ఉందని, దానికి తగిన ప్రాక్టీస్ అన్ని మొదలపెట్టానని, ఇండియా ని రెప్రెసెంట్ చేసే అవకాశం దొరికినందుకు చాలా లక్కీ గా ఫీల్ అవుతున్నట్టు అని ఆమె ఆనందాన్ని వ్యక్తం చేసింది. లారెన్ కొన్ని బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించింది. కాగా ఇప్పుడు నాటు నాటు సాంగ్ కు హాలీవుడ్ అందం తోడవ్వడంతో, సాంగ్ ఇంకా సూపర్ గా ఉంటుంది అంటూ సాంగ్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఈ ఫర్మామెన్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

కాగా ఆస్కార్స్ లైఫ్ రేపు సాయంత్రం 5 : 30 గంటల నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లైవ్ స్ట్రీమ్ కానుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు