RRR for Oscars: చరణ్‌కు అండగా బాలీవుడ్/హాలీవుడ్ బ్యూటీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గా ఎదిగిపోయాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ కు ఇంతటి గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పుడు రామ్ చరణ్ గత కొన్ని రోజుల నుంచి అమెరికాలోనే మకాం వేశాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ కి నామినేట్ అయిన విషయం తెలిసిందే. రేపు సాయంత్రం ఆస్కార్ అవార్స్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ అమెరికాలో ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ పై ప్రమోషన్స్ చేస్తున్నాడు.

అలాగే పనిలో పనిగా.. హాలీవుడ్ డెబ్యూపై కూడా ఫోకస్ చేశాడు. ఇటీవల హాలీవుడ్ లో ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హాలీవుడ్ డెబ్యూ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే గుడ్ న్యూస్ వింటారని.. తన ఫ్యాన్స్ కు ఓ హింట్ కూడా ఇచ్చాడు. దీంతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాలీవుడ్ అరంగేట్రం దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తోంది.

అయితే రామ్ చరణ్ హాలీవుడ్ డెబ్యూ కోసం ఒక హీరోయిన్ తెగ కష్టపడుతుందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. 13 ఏళ్ల క్రితం రామ్ చరణ్ బాలీవుడ్ డెబ్యూలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక చోప్రా. ఈ నటి కూడా ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు పొందింది. హాలివుడ్ లో మంచి ఇమేజ్ ను సంపాదించుకుంది. ఈ ఇమేజ్ ను ప్రస్తుతం చరణ్ హాలీవుడ్ ఎంట్రీకి ఉపయోగిస్తుందట.

ఇదిఇలా ఉండగా, జూనియర్ ఎన్టీఆర్ కూడా హాలీవుడ్ డెబ్యూ కోసం ట్రై చేస్తున్నాడట. దీనికి రాజమౌళి సాయం చేస్తున్నట్టు సమాచారం. మొత్తంగా తెలుగు హీరోలిద్దరు హాలీవుడ్ ఎంట్రీకి కష్టపడతున్నారు అన్నమాట. వీరి హాలీవుడ్ లో సినిమలు చేస్తే తెలుగు చిత్ర సీమ స్థాయి మరింత పెరిగే అవకాశం ఉంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు