Allari Naresh : అల్లరోడి సినిమాకు రిలీజ్ డేట్ కష్టాలు..

Allari Naresh : అల్లరి నరేష్.. ఈ పేరు వింటే ఓ వైపు హిలేరియస్ కామెడీ తో పాటు, మరో వైపు విలక్షణ మైన నటన కూడా గుర్తొస్తుంది. టాలీవుడ్ లో ఒక జెనరేషన్ ఆడియన్స్ ని తన కామెడి సినిమాలతో నవ్వించిన ఈ హీరో గత కొంత కాలంగా తన మార్క్ కామెడీ సినిమాలు చెయ్యట్లేదు. ఫలితంగా మినిమం గ్యారెంటీ హీరో కాస్తా ఒక్క హిట్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. అయితే రీసెంట్ గా ఉగ్రం సినిమాతో వచ్చినా అది సీరియస్ జోనర్ లో వచ్చిన చిత్రం కాగా, సంక్రాంతి కి నాగార్జున నా సామిరంగలో ప్రత్యేక పాత్రలో నటించి అలరించాడు. ఈ సినిమాలో నాగార్జున కంటే ఎక్కువ మార్కులు అల్లరి నరేష్ కొట్టేశాడని అందరికి తెలిసిందే. అయితే ఎన్నాళ్లనుంచొ అల్లరి నరేష్ నుండి ఒక పక్కా కామెడీ సినిమా రావాలని అనుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఇక అలాంటి సినిమానే ఇప్పుడు చేస్తున్నాడు. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాజీవ్ చిలక నిర్మిస్తున్న ఆ ఒక్కటి అడక్కు అనే పేరుతో కొత్త సినిమాలో అల్లరి నరేష్ హీరోగా నటిస్తుండగా, మల్లి అంకం అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా టీజర్ కూడా మంచి ఆసక్తిని రేకెత్తించింది. కాగా ఈ సినిమా రిలీజ్ కి మాత్రం ముందు నుండి అడ్డంకులు వస్తున్నాయి.

రిలీజ్ డేట్ కోసం వెయిటింగ్..

అల్లరి నరేష్ తన తండ్రి ఇవివి దర్శకత్వంలో వచ్చిన ఆ ఒక్కటి అడక్కు సినిమా టైటిల్ నే సెంటిమెంట్ గా పెట్టుకుని వస్తున్నాడు నరేష్. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం వాయిదా పడుతూనే వస్తుంది. మల్లి అంకెం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. అయితే నిజానికి ఈ సినిమా మార్చి 22నే విడుదల కావాల్సింది. అయితే ప్రమోషన్, బిజినెస్ ఆలస్యం కావడంతో వాయిదా వేసుకున్నారు. ఇప్పుడవన్నీ కొలిక్కి వచ్చాయని సమాచారం. కానీ ఆ ఒక్కటి అడక్కు సినిమాకి రిలీజ్ డేట్ దొరకడం మాత్రం పెద్ద సమస్యగా మారింది. బహుశా ముందనుకున్న రిలీజ్ డేట్ కే వచ్చి ఉంటే వీళ్ళకి మంచి అడ్వాంటేజ్ అయి ఉండేది కానీ, ఇప్పుడు దాని గురించి చర్చ అనవసరం. ఇక ఇప్పుడు ఉన్న రిలీజ్ డేట్లలో చాలా సినిమాలు కబ్జా చేయడం వల్ల ఈ సినిమాకు సోలో రిలీజ్ మాత్రం దక్కేలా లేదు. ఇక నెక్స్ట్ ఉన్న ఆప్షన్ లో ఏప్రిల్ 19 బాగానే ఉన్నా సమయం లేదు కాబట్టి ఇదీ సాధ్యం కాదు. ఏప్రిల్ 25 దిల్ రాజు బ్యానర్ నుంచి లవ్ మీ, తో పాటు విశాల్ రత్నం, తమన్నా అరన్మయి 4 లాంటి సినిమాలున్నాయి కాబట్టి, థియేటర్ల సమస్య వస్తుంది.

మే ఎండింగ్ లో ఛాన్స్?

ఇక అల్లరి నరేష్ సినిమా కు ఏప్రిల్ లో ఛాన్స్ లేకపోగా, మే నెల ఆప్షన్లు కూడా చూస్తున్నారు. అయితే ఏపీ ఎన్నికల నేపథ్యంలో, అలాగే తెలంగాణాలో కూడా ఎంపీ ఎన్నికల వల్ల ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, కనక దానికి అనుగుణంగానే తేదీని ప్రకటించలేదు. అయితే ఈ సినిమాను మే ఎండింగ్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. కానీ మే 30న కల్కి రిలీజ్ అంటున్నారు, కానీ ఆ సినిమా రిలీజ్ డేట్ కూడా కంఫర్మ్ కాలేదు. ఇక ఆ ఒక్కటి అడక్కు హిట్ కావడం అల్లరి నరేష్ కు చాలా కీలకం.ఎందుకంటే తిరిగి ఎంటర్టైన్మెంట్ జానర్ కు రావడం సరైన నిర్ణయమేనని ఋజువు కావాలంటే ఒక పెద్ద హిట్టు పడాలి. పైగా నిర్మాణంలో ఉన్న బచ్చల మల్లి కూడా వినోదాన్ని ఆధారంగా చేసుకున్నదే. కామెడీ సినిమాలతో జనాలను నవ్వించడం పెద్ద టాస్క్ గా మారిపోయిన ట్రెండ్ లో కొత్త తరాన్ని మెప్పించడం నరేష్ లాంటి హీరోలకు సవాల్ గా మారింది. అయితే ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం అల్లరి నరేష్ సినిమాను జూన్ రెండో వారం లో లేదా మూడో వారంలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని, అంతకంటే ముందే మే లోనే మంచి డేట్ దొరికితే రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు