Maidaan : వచ్చిన వాటిల్లో ఇదే బెటరట..

Maidaan : టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో రెండు తెలుగు సినిమాలు కాగా, మరో నాలుగు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ కావడం జరిగింది. ఇక తెలుగులో గీతాంజలి మళ్ళీ వచ్చింది, శ్రీ రంగ నీతులు తో పాటు, తమిళ్ డబ్ లవ్ గురు, హిందీ నుండి బడే మియా చోటే మియా, మైదాన్ చిత్రాలు రిలీజ్ కావడం జరిగింది. రంజాన్ రోజున రిలీజ్ అయిన ఈ సినిమాలు ఒక్కోటి ఒక్కో జోనర్ లో తెరకెక్కిన సినిమాలు. అయితే రిలీజ్ అయిన సినిమాల్లో ప్రేక్షకులని మెప్పించే నిఖార్సైన సినిమా మాత్రం రాలేదని టాక్ నడుస్తుంది. లవ్ గురు సినిమా అనుకున్నట్టే రొటీన్ కంటెంట్ తో రాగా, శ్రీ రంగ నీతులు కూడా మెప్పించలేదు. అందుకే ఆ సినిమా మేకర్స్ ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయలేదు. ఇక హిందీ నుండి బడే మియా చోటే మియా రిలీజ్ కాగా మాస్ కమర్షియల్ గా తెరకెక్కిన ఆ సినిమా ప్రేక్షకుల దగ్గర రొటీన్ సినిమాగానే టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా ట్రైలర్ తోనే గెస్ చేసిన ఆడియన్స్ ఇప్పుడు రిలీజ్ తర్వాత కంఫర్మ్ చేసారు. ఇక థియేటర్ల వద్ద బుకింగ్స్ కూడా ఆశించిన రేంజ్ లో జరగలేదు.

తెలుగులో నిరాశ..

ఇక తెలుగు వెర్షన్ కి సంబంధించి ఈ వారం అంజలి నటించిన గీతాంజలి మళ్ళి వచ్చింది హారర్ కాన్సెప్ట్ తో రిలీజ్ కాగా, రొటీన్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. సుహాస్ శ్రీ రంగ నీతులు కూడా రొటీన్ అనిపించుకుంది. దాంతో తెలుగులో ఈ వారం మంచి సినిమాలైతే రాలేదు. ఇక డబ్బింగ్ సినిమా లవ్ గురు కూడా నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక బాలీవుడ్ మూవీ బడే మియా చోటే మియా కూడా తెలుగులో డబ్ అయింది కానీ, హిందీ వెర్షనే ఎవరూ పట్టించుకోలేదు, మరి తెలుగు లో ఎవరు చూస్తారు.. కానీ నెగిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. అయితే ఈ క్రమంలో బాలీవుడ్ లో అజయ్ దేవగన్ నటించిన మైదాన్ సినిమాకు మాత్రం పాజిటివ్ టాక్ వచ్చింది.

ఒకే ఒక్క సినిమా..

ఇక బాలీవుడ్ లో మూడేళ్లకుపైగా వాయిదా పడుతూ వచ్చిన మైదాన్ సినిమా ఎట్టకేలకు థియేటర్లలో అడుగు పెట్టింది. దాదాపు ఈ సినిమా ఇప్పటికే పది సార్లు వాయిదా పాడడం గమనార్హం. అజయ్ దేవగన్ హీరోగా బోనీ కపూర్ నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామా మీద ముందు నుంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అందుకే పోటీగా బడేమియా చోటేమియా లాంటి యాక్షన్ ఎంటర్ టైనర్ ఉన్నప్పటికీ ఆడియన్స్ అధిక శాతం దీనివైపే ఆసక్తి చూపారు. రిలీజ్ డేట్ 11న అయినప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో ముందు రోజు సాయంత్రం నుంచే ప్రీమియర్లు వేశారు. అనుకున్నట్టుగానే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రియమణి భార్య పాత్రలో నటించగా భారీ బడ్జెట్ తో అమిత్ శర్మ దర్శకత్వంలో రూపొందించారు. ఒక ఫుట్ బాల్ కోచ్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో ఈ సినిమా ఒక్కటే బెటర్ అనిపించుకోగా, డీసెంట్ ఓపెనింగ్స్ అందుకుంటున్న మైదాన్ లాంగ్ రన్ లో పికప్ అయ్యే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు