The GOAT : రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న దళపతి చిత్రం..

The GOAT : కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి హీరోగా ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం పేరుతో సినిమా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. లియో సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత విజయ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా విజయ్ చివరి చిత్రమని ఈ సినిమా తర్వాత రాజకీయాల్లో బిజీ అవుతాడని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాలో తప్ప వేరే ఏ చిత్రంలోనూ నటించట్లేదనేదైతే తెలుసు. ఇక వెంకటేష్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తో మంచి చేయగా, తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్.

రిలీజ్ డేట్ ఫిక్స్..

ఇక విజయ్ నటిస్తున్న ది గోట్ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 5న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించడం జరిగింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాలో జయరామ్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, మైక్ మోహన్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కల్పాతి, కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇక త్వరలోనే టీజర్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇదే సరైన డేట్..

ఇక విజయ్ నటిస్తున్న ‘ది గోట్’ సినిమా రిలీజ్ అవుతున్న సెప్టెంబర్ 5కి ఓ ప్రత్యేకత ఉందంటూ విజయ్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన స్నేహితుడు సినిమాలో సెప్టెంబర్ 5వ తేదీని గుర్తుపెట్టుకో అంటూ ఒక సీన్ ఉంటుంది. ఇప్పుడు అదే సీన్‌ను సరదాగా షేర్ చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. అయితే సెప్టెంబర్ మొదటి వారంలోనే సినిమా రిలీజ్ అవుతుండటంతో ఆ సమయంలో కేరళలో ఓనం సెలవలు ఉన్నాయి. అంటే దాదాపు 10 రోజులు సెలవులు దొరుకుతాయి. అలానే వినాయకచవితి కూడా ఉంది. ఇలా మొత్తానికి ఓ రెండు వారాల లాంగ్ వీకెండ్ అయితే ఈ సినిమాకి ప్లస్ అవుతుందంటూ ఫ్యాన్స్ లెక్కేస్తున్నారు. ఎందుకంటే కేరళలో విజయ్‌కి భారీ ఫాలోయింగ్ ఉంది. దీంతో ఈసారి ఓనంకి విజయ్ మరో హిట్ కొట్టడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. అలాగే విజయ్ సినిమాను తెలుగులో ఎంత ఆదరిస్తారో తెలిసిందే. ఇక వారసుడు లాంటి సినిమాలు రొటీన్ టాక్ తెచ్చుకున్నా తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు సాధించాయి. మరి రాబోయే ది గోట్ సినిమా తో విజయ్ ఆడియన్స్ ని ఎలా మెప్పిస్తాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు