Nani 32 : నానితో రవితేజ హీరోయిన్ రొమాన్స్… ఈ హీరోయిన్ ను ఎందుకింత పాపులర్ చేస్తున్నారు?

Nani 32 : భాగ్యశ్రీ బోర్సే… ఈ హీరోయిన్ పేరు ఇటీవల కాలంలో టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తోంది. ఏ కొత్త సినిమా గురించిన వార్త తెరపైకి వచ్చినా ఈ బ్యూటీనే అందులో హీరోయిన్ అంటూ రూమర్లు క్రియేట్ చేసి ఆమె పాపులారిటీని పెంచేస్తున్నారు. తాజాగా నాని సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది అంటూ ప్రచారం మొదలు పెట్టారు. అంతకంటే ముందే విజయ్ దేవరకొండ సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తుందంటూ వార్తలు వచ్చాయి. మరి ఇంతకీ భాగ్యశ్రీ చేతిలో ఉన్న సినిమాలు ఎన్ని? ఆమెపైనే ఎందుకు ఇన్ని రూమర్లు వస్తున్నాయి? అనే వివరాల్లోకి వెళితే…

నానితో భాగ్యశ్రీ రొమాన్స్…

నేచునల్ స్టార్ నాని సక్సెస్ ఫుల్ హీరోగా జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాడు. గత ఏడాది దసరా, హాయ్ నాన్న వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న నాని హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆగస్టులో రిలీజ్ కాబోతున్న సరిపోదా శనివారం మూవీతో ఖచ్చితంగా హ్యాట్రిక్ స్కోర్ చేస్తానని నమ్మకంతో ఉన్నాడు నాని. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే మరో అరడజను సినిమాలను లైన్లో పెట్టేసాడు నాని. అందులో సుజీత్ తో నాని నెక్స్ట్ మూవీ చేయబోతున్నారు.

రీసెంట్ గా నాని పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ను ఇచ్చారు మేకర్స్. ఇక త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఫిక్స్ అయ్యిందనే వార్త వైరల్ అవుతుంది. సుజిత్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజి మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఆ మూవీ పూర్తవ్వగానే నాని సినిమాపై దృష్టి పెట్టనున్నాడు సుజిత్. అంతలోనే ఈ ప్రాజెక్ట్ కు హీరోయిన్ ఫిక్స్ అయ్యిందని వార్తలు మొదలయ్యాయి. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో నాని సరసన బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించబోతుందని అంటున్నారు. మిస్టర్ బచ్చన్ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ భామకు సంబంధించిన రోజుకో వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.

- Advertisement -

రోజుకో సినిమాలో హీరోయిన్ గా…

యారియాన్ 2 మూవీతో హిందీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే గురించి టాలీవుడ్ లో రోజుకో వార్త వైరల్ అవుతుంది. హరిష్ శంకర్, రవితేజ కాంబినేషన్లో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ మూవీతో తెలుగు వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీ రూమర్లతోనే తెగ పాపులర్ అవుతోంది. నిన్నటిదాకా విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ లో భాగ్యశ్రీ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని రూమర్లు వచ్చాయి. ఇప్పుడేమో నానితో జతకడుతోందని అంటున్నారు. కానీ ఆమె నెక్స్ట్ సినిమాలపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. మరి ఈ బ్యూటీనే రూమర్లు ఇంతగా ఎందుకు వెంటాడుతున్నాయో ఆమెకే తెలియాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు