Viswam Teaser : సీరియల్ కిల్లర్ గా గోపి మాస్.. కసిమీదున్నాడు..

Viswam Teaser : టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ ఎంటర్టైన్మెంట్ చిత్రాల దర్శకుడు శ్రీనువైట్లతో ‘విశ్వం’ అనే సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా రెగ్యులర్ షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది. ఇదిలా ఉండగా యాక్షన్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న గోపీచంద్ చాలా కాలంగా సక్సెస్ లేక సతమతమవుతున్నాడు. దాదాపు నిఖార్సైన హిట్టు కొట్టి పదేళ్లు కాగా, రీసెంట్ గా వచ్చిన భీమా సినిమా కాస్త పరవాలేదు అనిపించినప్పటికీ కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ఇక ఇప్పుడు ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని సీనియర్ డైరెక్టర్ శ్రీనువైట్ల తో గోపీచంద్ విశ్వం సినిమా చేస్తున్నాడు. పదేళ్లుగా ప్లాపుల్లో ఉన్న శ్రీనువైట్లకు కూడా ఈ సినిమా చాలా కీలకమే. ఇక చాలా రోజులుగా విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. కాబట్టి ఈ సినిమాతో ఈ ఈ ఇద్దరికీ ఖచ్చింతగా మంచి హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. ఇక తాజాగా విశ్వం సినిమా ఫస్ట్ స్ట్రైక్ అంటూ కాసేపటికింద మేకర్స్ ఒక టీజర్ విడుదల చేశారు.

సీరియల్ కిల్లర్ గా గోపి.. ?

ఇక గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ‘విశ్వం’ (Viswam Teaser) అనే టైటిల్ తో రూపొందుతుండగా, ఈ సినిమా టీజర్ లో గోపీచంద్ గతంలో ఎప్పుడు లేనంత డిఫరెంట్ క్యారెక్టర్ తో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. కానీ ఈ తరహా పాత్రలు చాలా సినిమాల్లో చూసే ఉన్నాం. ఇక ఈ ఫస్ట్ స్ట్రైక్ లో గోపీచంద్ ఒక గన్నుతో కాశ్మీర్ లో ఒక పెళ్లిలోకి వెళ్లి అక్కడ అందర్నీ చంపేసిన విధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందరూ సంతోషంగా పెళ్లి చేసుకుంటున్న సమయంలో గోపీచంద్ ఎందుకు వారందరిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు అనేది సినిమా చూస్తే కానీ అర్థం కాదు. ఇక టీజర్ చివర్లో గోపీచంద్ హిందీలో చెప్పిన డైలాగ్ సూపర్ గా ఉంది. టీజర్ లో అందర్నీ చంపిన తర్వాత అక్కడ ఉన్న అన్నం తింటూ ‘ఎవరి పేరు మీద రాసి పెట్టి ఉంటే అన్నం వాళ్ళకే దక్కుతుంది’… ఈ అన్నం నా పేరు మీద రాసి పెట్టి ఉంది’ అంటూ హిందీలో చెప్పిన డైలాగ్ సాలిడ్ గా ఉంది. ఒకవేళ సినిమాలో సీరియల్ కిల్లరా? లేదంటే దీని వెనక ఏదైనా బలమైన కారణం ఉందా? ఒకవేళ సినిమాలో గోపీచంద్ నెగటివ్ షెడ్ లో కూడా కనిపిస్తున్నాడా అనే డౌట్స్ కూడా క్రియేట్ చేశారు.

- Advertisement -

నెగిటివ్ షేడ్స్ లో గోపీచంద్?

అన్నిటికి మించి ఈ టీజర్ తర్వాత సినిమాలో బహుశా గౌతమ్ నంద లో లాగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడా అని కూడా అనిపిస్తుంది. అయితే గోపీచంద్ హీరోగా పరిచయమైనా, మొదట విలన్ గానే క్లిక్కయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హీరోగా పలు సినిమాలతో మంచి క్రేజ్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక శ్రీనువైట్ల ఈసారి విశ్వంలో ఎలా గోపిచంద్ ని ప్రజెంట్ చేస్తాడో చూడాలి. మొత్తానికి ఈ ఫస్ట్ లుక్ స్ట్రైక్ అయితే బాగానే హైలెట్ అయింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ లో టిజి విశ్వ ప్రసాద్ వేణు దోనేపూడి కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక కావ్య థాపర్ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ సినిమాతో నైనా గోపీచంద్ మాస్ కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు