Avanthika Vandanapu : మళ్ళీ ట్రోలింగ్… హాలీవుడ్ యువరాణిగా అవంతిక పనికిరాదా?

Avanthika Vandanapu : ఇండియన్ స్టార్ హీరోయిన్లు కూడా కలలు కనే సినిమా లోకం హాలీవుడ్. కానీ తెలుగు అమ్మాయి అవంతిక వందనపు మాత్రం ఇండియన్ అమెరికన్ యాక్టర్ గా చిన్న ఏజ్ లోనే విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో మెరిసిన అవంతిక టీనేజ్ వచ్చేసరికి హాలీవుడ్ లో అడుగు పెట్టి అక్కడ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అంత టాలెంట్ ఉన్న అవంతిక యాసపై చాలా మంది తెలుగు వాళ్ళు ట్రోల్ చేయడం బాధాకరం. ఇక తాజాగా అమెరికన్స్ కూడా ఈ బ్యూటీని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఆమె హాలీవుడ్ యువరాణి పాత్రకు పనికిరాదంటూ మండిపడుతున్నారు. మరి ఇంతకీ అవంతిక ఏ యువరాణి పాత్రలో నటిస్తోంది? అమెరికన్లకు ఎందుకంత కోపం వచ్చింది? అనే వివరాలకు వెళ్తే…

ఎవర్ గ్రీన్ యానిమేషన్ సినిమాలకు రియల్ యాక్టర్లతో ప్రాణం పోసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది డిస్నీ. ఈ నేపథ్యంలోనే పాపులర్ యానిమేటెడ్ మూవీ టాంగిల్డ్ ను లైవ్ యాక్షన్ మూవీగా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో రెపాంజల్ అనే యువరాణి పాత్రను అవంతిక చేయబోతున్నట్టు హాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇప్పటికే ఆ పాత్ర కోసం హీరో మిలో మాన్యన్ తో కలిసి అవంతిక టెస్ట్ షూట్ లో కూడా పాల్గొన్నదని తెలుస్తోంది. అయితే హాలీవుడ్ నటిగా రాణిస్తున్న అవంతికకు షాక్ ఇచ్చేలా జాత్యహంకార కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది అమెరికన్లు.

రెపాంజల్ అనేది వైట్ గర్ల్ పాత్ర అని, అలాంటి హాలీవుడ్ బ్యూటీ పాత్రను ఒక ఇండియన్ అమెరికన్ గర్ల్ పోషించనుందనే విషయం తమకు నచ్చలేదని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అవంతిక ఇన్స్టాగ్రామ్ లో నెగిటివ్ గా కామెంట్స్ చేస్తూ ట్రోలింగ్ మొదలు పెట్టారు. అక్కడితో ఆగకుండా తమ అసంతృప్తిని మీమ్స్ ద్వారా బయట పెడుతున్నారు. రెపాంజల్ పాత్రకు అవంతిక సెట్ అవ్వదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

కానీ ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలను చూశాక రెపాంజల్ గా అవంతిక కరెక్ట్ గా సెట్ అవుతుందని అంటున్నారు ఆమె అభిమానులు. నిజానికి అవంతిక ముఖ కవళికలు, హెయిర్ రెపాంజల్ పాత్రకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి. ఇక తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై అవంతిక ఇప్పటిదాకా స్పందించలేదు. మరి ఇంతకీ ఆమె రెపాంజిల్ గా కనిపించబోతుందా అనే విషయంపై కూడా అధికారిక సమాచారం లేదు.

కేవలం ఒక ఇండియన్ అమెరికన్ యాక్టర్ అనే నెపంతో అవంతిక పై ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు ఆమె అభిమానులు. ఇప్పటికే డిస్నీ తెరకెక్కించిన స్పిన్ అనే మూవీ లో అవంతిక నటించి మెప్పించింది. కాబట్టి ఇప్పుడు ట్యాంగిల్ మూవీలో కూడా ఆమె నటిస్తుందని నమ్ముతున్నారు చాలామంది. అదే నిజమైతే అవంతిక ఇంకా ఎన్నో కోట్ల మందికి దగ్గరయ్యే అవకాశం దొరుకుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు