Mahima Nambiar : ఆ స్టార్ హీరో ఏడేళ్లు బ్లాక్ చేశాడు… షాకింగ్ విషయం బయట పెట్టిన హీరోయిన్

Mahima Nambiar : సినిమా ఇండస్ట్రీలో జరిగే గొడవలు కొన్ని ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. తాజాగా తనకు ఓ హీరోకు మధ్య జరిగిన గొడవను బయట పెట్టింది మలయాళ హీరోయిన్ మహిమ నంబియార్. సదరు హీరో తన నెంబర్ ను దాదాపు ఏడేళ్ల పాటు బ్లాక్ చేశాడని చెప్పి షాక్ ఇచ్చింది. మరి ఇంతకీ మహిమను బ్లాక్ చేసిన ఆ స్టార్ హీరో ఎవరు? అనే వివరాల్లోకి వెళితే…

ఇదే హీరో హీరోయిన్ మధ్య జరిగిన వివాదం

మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. భాగమతి సినిమాలో హీరోగా నటించారు ఆయన. ప్రస్తుతం ఈ హీరో జై గణేష్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలోనే హీరోయిన్ గా చేస్తోంది మహిమ నంబియార్. తాజాగా జరిగిన ఈ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న మహిమ హీరో ఉన్ని గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.

మహిమా మాట్లాడుతూ 2017లో రిలీజ్ అయిన మాస్టర్ పీస్ అనే సినిమాలో తాను ఉన్ని ముకుందన్ కలిసి నటించామనే విషయాన్ని గుర్తు చేసింది. అయితే ఆ సినిమా రిలీజ్ అయ్యాక స్క్రిప్ట్ రైటర్ ఉదయన్ కృష్ణ దగ్గర మహిమ ఉన్ని నెంబర్ ను తీసుకుందట. ఆ తర్వాత సమయం చూసుకొని వాట్సాప్ లో ఉన్ని కి మహిమ వాయిస్ మెసేజ్ పంపించిందట. అందులో తాను మహిమను అనే విషయాన్ని తెలియజేసి, స్క్రిప్ రైటర్ ఉదయన్ దగ్గర అతని నెంబర్ ఎలా తీసుకుందనే విషయాన్ని వివరించిందట. అయితే ఆ ఒక్క వాయిస్ మెసేజ్ లో ఆమె ఉదయన్ అని రెండు మూడు సార్లు సంబోధించిందట. ఆశ్చర్యకరంగా ఆ వాయిస్ మెసేజ్ విన్న వెంటనే ఉన్ని ముకుందన్ మహిమ నెంబర్ ను బ్లాక్ చేశారట. ఆయన ఎందుకలా చేశారనే విషయం తనకు అర్థం కాలేదని, ఆ తర్వాత ఉదయన్ కు ఫోన్ చేసిన ఉన్ని మహిమ గురించి కంప్లైంట్ చేశారట. మహిమ అహంకారి అని, పదేపదే ఉదయన్ అని పిలుస్తోందని, ఓ సీనియర్ ను ఇలా సంబోధిస్తారా అంటూ ఫైర్ అయ్యారట. అదే కోపంతో మహిమ నెంబర్ ను ఏడేళ్ల పాటు బ్లాక్ చేసారట.

- Advertisement -

ఇక తాజాగా జై గణేష్ ప్రమోషన్ సందర్భంగా తాను ఉదయన్ ను ఎందుకలా పిలవాల్సి వచ్చిందో పిలవాల్సి వచ్చిందో వివరణ ఇచ్చింది మహిమ. ఉదయన్ కృష్ణతో తనకున్న మంచి పరిచయం వల్లే అలా పేరు పెట్టి పిలిచేదాన్ని అని, కానీ ఉన్నికి ఆ విషయం తెలియకపోవడం వల్ల ఇలా చేసి ఉండొచ్చని క్లారిటీ ఇచ్చింది. ఇక ఇదే విషయంపై స్పందించిన ఉన్ని ముకుందన్ ఆమె ఆ సమయంలో అలా చేయడం వల్ల వచ్చిన కోపంతోనే ఇన్నేళ్లు బ్లాక్ చేశానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తను నటిస్తున్న సినిమాలో మహిమ హీరోయిన్ అని తెలియగానే తన నెంబర్ ను అన్ బ్లాక్ చేసి మెసేజ్ పంపానని చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు