Lucky Bhaskar Teaser : మిడిల్ క్లాస్ వాడి పంతం..

Lucky Bhaskar Teaser : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మహానటి తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరో, సీతారామం తో మరింత చేరువయ్యాడు. ఎంతో మందికి ఫేవరేట్ అయ్యాడు . ఇక ఇప్పుడు ఏకంగా తెలుగువాడు అయ్యేలా తెలుగు సినిమాలు చేస్తూ ఉన్నాడు. తాజాగా మళయాళంతో పాటు వరుసగా తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. మలయాళం ఇండస్ట్రీలో దూసుకుపోతున్న దుల్కర్ గత కొంతకాలంగా తెలుగులో కూడా మంచి క్రేజ్ అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగు మార్కెట్ ని వదులుకోరాదని తన ప్రతి మలయాళం సినిమాని కూడా తెలుగులో డబ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా తెలుగు దర్శక నిర్మాతలతో అతను వరుస సినిమాలు చేసేందుకు అడుగులు వేస్తూ ఉన్నాడు. తాజాగా దుల్కర్ లక్కీ భాస్కర్ గా ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నాడు. కాసేపటి కిందే రిలీజ్ అయిన టీజర్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది.

మిడిల్ క్లాస్ బ్యాంక్ ఎంప్లాయ్ గా..

దుల్కర్ నుంచి నెక్స్ట్ రాబోయే సినిమా లక్కీ భాస్కర్ పైనే అందరి దృష్టి ఉండగా, తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ నేడు విడుదల చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చునర్ ఫోర్ శ్రీకర స్టూడియోస్ వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక సినిమాకు సంబంధించిన టీజర్ లో హీరో క్యారెక్టర్ ను హైలెట్ చేస్తూ టీజర్ ని డిజైన్ చేశారు. ఒక మధ్యతరగతి బ్యాంకు ఉద్యోగి అయిన భాస్కర్ చాలా పొదుపు చేసే వ్యక్తి అని ఒక డైలాగ్ తోనే, ఒకే ఒక్క షాట్ తో అతని పాత్ర స్వభావం చెప్పేశారు. ఇక అతను బ్యాంకులో రోజు డబ్బులు చూస్తూ ఉన్నప్పటికీ వాటిని అందుకోలేని పరిస్థితి. అయితే ఊహించని విధంగా ఆ ఉద్యోగి అకౌంట్లో చాలా డబ్బు ఉంటుందని ట్రైలర్ చివర్లో ఆ పాయింట్ చెప్పడం మరింతగా హైలెట్ అయ్యింది. మరి ప్రతి పైసా కూడా బెట్టుకునే లక్కీ భాస్కర్ అకౌంట్ లో అన్ని డబ్బులు ఎలా వస్తాయి. అసలు భాస్కర్ గోల్ ఏంటీ? కథ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే.

- Advertisement -

ఇంట్రస్టింగ్ గా గ్రిప్పింగ్ గా..

లక్కీ భాస్కర్ టీజర్ (Lucky Bhaskar Teaser) చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించగా, టీజర్ 90స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. మొత్తానికి ఇది మరో మిడిల్ క్లాస్ అబ్బాయి కథ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో దుల్కర్ కు జోడిగా మీనాక్షి చౌదరి కనిపించబోతోంది. వింటేజ్ బ్యాక్ డ్రాప్ ఆర్ట్ వర్క్ వల్ల సినిమాసినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా కనిపిస్తోంది. ఇక దర్శకుడు వెంకీ అట్లూరి ప్రేక్షకులను 30 ఏళ్ళు వెనక్కి తీసుకు వెళ్లే విధంగా సినిమాను డిజైన్ చేసాడు. ఇక సినిమా కంటెంట్ జనాలకు ఏ మాత్రం కనెక్ట్ అయిన కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం సినిమాలో స్టాక్ మార్కెట్ కు సంబంధించిన పాయింట్ ఉంటుందని టాక్. ఇక జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జులై లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు