Work Place Anxiety : ఆఫీస్ గురించి ఆలోచిస్తేనే చెమటలు పడుతున్నాయా? ఈ టెన్షన్ ను ఎలా తగ్గించాలంటే?

Work Place Anxiety : మనలో చాలా మంది జీవితంలో సగానికి పైగా సమయాన్ని ఆఫీసులోనే గడుపుతాము. అయితే ఆఫీసులో ఉన్నంత సేపు ఇచ్చిన టాస్క్ ను టైంకి పూర్తి చేయడం, బాస్ అంచనాలను అందుకోవడం లేదా కొత్త ప్రాజెక్టును చేపట్టడం వంటి అనేక రకాల టెన్షన్లు మనల్ని చుట్టుముడతాయి. చాలా సార్లు పని భారంతో కలిగే ఒత్తిడి కారణంగా ఆఫీసులలో పని చేసేవారు తీవ్ర ఆందోళనకు గురవుతారు. దీన్నే వర్క్ ప్లేస్ యాంగ్జైటీ అంటారు.

ఒక వ్యక్తి తన పని లేదా ఉద్యోగం గురించి ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే మానసిక స్థితిని వర్క్ ప్లేస్ యాంగ్జైటీగా పిలుస్తారు. ఈ యాంగ్జైటీ ఉన్న వ్యక్తులు పని గురించి అతిగా ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ టెన్షన్ ఎక్కువై ఏ పని పైనా సరిగ్గా దృష్టి పెట్టలేరు. అలాగే ఎక్కువగా నెగిటివ్ థింకింగ్ తో ఇబ్బంది పడతారు. మరి మీరు కూడా ఇలా వర్క్ ప్లేస్ యాంగ్జైటీకి గురైతే ఆ సమయంలో ఈ చిన్ని చిట్కాలతో మీ సమస్యను దూరం చేసుకోండి.

1. వ్యాయామం చేయండి

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆఫీసులో ఆందోళనకు గురైతే ప్రతి రోజూ కొంత సమయం పాటు యోగా చేయండి. దీని వల్ల మనసు రిలాక్స్ అవుతుంది. యోగాను మొదలు పెట్టిన కొన్ని రోజుల్లోనే మీకు ఆందోళన నుండి ఉపశమనం లభిస్తుంది.

- Advertisement -

2. తగినంత నిద్ర

ప్రతి మనిషి 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోతే, అపుడే శరీరానికి కావలసినంత రెస్టు దొరికి, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. దీంతో ఆందోళన తగ్గిపోతుంది. ఆఫీస్ టెన్షన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ప్రతిరోజూ సమయానికి నిద్రపోయి, ఉదయాన్నే లేవడానికి ప్రయత్నించండి. అలాగే నిద్రపోయే ముందు ఫోన్ చూడడం మానేయండి. లేదంటే సరిగ్గా నిద్ర పట్టదు.

3. పంక్చువాలిటీ మస్ట్

పనిని సకాలంలో పూర్తి చేయలేని వ్యక్తులు ఆఫీసులో ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు. అలాంటి వారు గడువు తీరక ముందే పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. టైంకు ఆఫీస్ కి వెళ్ళండి. ఎవరినైనా హెల్ప్ అడగడానికి వెనకడొద్దు. అలాగని ఎవరి పైన పూర్తిగా ఆధారపడకూడదని గుర్తు పెట్టుకోండి.

4. మాట్లాడండి

ఎక్కువ సమయం ఆఫీసులో ఒంటరిగా గడిపే వ్యక్తులే వర్క్ ప్లేస్ యాంగ్జైటీతో బాధపడే అవకాశం ఉంటుంది. యాంగ్జైటీ నుంచి దూరంగా ఉండాలంటే మీ కొలీగ్స్ తో లేదా ఆఫీస్లోని ఇతర వ్యక్తులతో తరచుగా మాట్లాడుతూ ఉండండి. దీనివల్ల ఆఫీస్ వాతావరణం ఫ్రెండ్లీగా మారుతుంది. ఒత్తిడి తగ్గి మీ మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది.

5. నెగిటివ్ ఎనర్జీకి దూరంగా ఉండండి

ఆఫీసులో తరచుగా కొంత మంది వ్యక్తులను చూస్తే నెగెటివిటీ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అలాంటి వారి నుంచి, మీకు నచ్చని వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు