Rashmi: బిజినెస్ మ్యాన్ తో ఏడడుగులు వేయనున్న రష్మీ..!

తెలుగు బుల్లితెరపై యాంకర్ రష్మీ గురించి ఎంత చెప్పినా తక్కువే.. సుధీర్, రష్మీ జోడీ కి ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. మీడియం రేంజ్ హీరోయిన్ల కంటే ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంది రష్మి. అయితే రష్మీ యాంకర్ కాకముందే పలు సినిమాలలో చిన్నచిన్న క్యారెక్టర్లలో నటించినా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. కానీ ఎప్పుడైతే జబర్దస్త్ షోలోకి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుంచి మంచి క్రేజ్ అందుకుంది.

ఆ తర్వాత గుంటూరు టాకీస్ , బొమ్మ బ్లాక్ బాస్టర్ తదితర చిత్రాలలో నటించి హీరోయిన్ గా కూడా మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. రష్మీ, సుధీర్ గురించి గతంలో ఎన్నో రూమర్స్ వినిపించాయి. కానీ వీరిద్దరూ కేవలం ఆన్ స్క్రీన్ కోసమే నటించామంటూ.. మేము మంచి స్నేహితులను మాత్రమే అంటూ ఎన్నోసార్లు తెలియజేసినా.. అభిమానులు మాత్రం వీరి మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లుగానే తెలియజేస్తూ ఉంటారు. అందుకు కారణం వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అంత బాగా కుదిరిందని చెప్పవచ్చు. అంతేకాకుండా వీరిద్దరిని వివాహం చేసుకోమని పలువురు నెటిజెన్స్ సైతం సూచిస్తూ ఉంటారు.

అయితే ఇప్పుడు తాజాగా యాంకర్ రష్మీకి సంబంధించి పెళ్లి విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. తాజా గా అందుతున్న సమాచారం ప్రకారం యాంకర్ రష్మీ ఒడిస్సా ప్రాంతానికి చెందిన ఒక యంగ్ వ్యాపారవేత్తతో గత కొద్దిరోజులుగా ప్రేమాయణం నడుపుతోందని.. దీంతో ఇరువురి కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారని.. త్వరలోనే రష్మీ ఆ బిజినెస్ మాన్ ని వివాహం చేసుకొని.. వైవాహిక బంధం లోకి అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ గతంలో కూడా ఇలా ఎన్నోసార్లు రష్మీ పెళ్లిపైన వార్తలు వినిపించాయి. ఈ విషయం మాత్రం అటు ఇండస్ట్రీలో బుల్లితెర పైన హాట్ టాపిక్ గా మారుతోంది.

- Advertisement -

ఇటీవల రష్మీ ఒక సంచలన నిర్ణయం కూడా తీసుకుంది. ఇక మీదట తాను సినిమాలలో నటించకూడదని.. కేవలం బుల్లితెర పైన మాత్రమే ప్రేక్షకులను అలరించడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తానంటూ తెలియజేయడం జరిగింది. అందుకే రష్మి తన దగ్గరికి వచ్చిన సినిమా అవకాశాలను కూడా రిజెక్ట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రష్మి అటు శ్రీదేవి డ్రామా కంపెనీ తో పాటు ఎక్స్ట్రా జబర్దస్త్ లో యాంకర్ గా భారీగానే సంపాదిస్తుంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు