Actress: బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సక్సెస్ కాని హీరోయిన్స్ వీళ్ళే..!

ఏ ఇండస్ట్రీలో నైనా వారసత్వంగా పిల్లలు సైతం ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలా ఇప్పటికే చాలా మంది వారసులు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్నారు. అయితే ఇక వారసురాళ్ళ విషయానికి వస్తే.. స్టార్ సినీ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ హీరోయిన్ గా మాత్రం చాలా మంది సక్సెస్ కాలేకపోయిన వారు ఉన్నారు. మరి ఇండస్ట్రీలో అలా సక్సెస్ కాలేకపోయిన హీరోయిన్ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1). నిహారిక:
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి భారీ క్రేజ్ ఉంది.. మెగా వారసురాలిగా నిహారిక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో చిత్రాలలో నటించినా ఏ ఒక్క సినిమా కూడా తనకు గుర్తింపు ఇవ్వలేదు. దీంతో ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం పలు రకాల వెబ్ సిరీస్ లకు నిర్మాతగా ఉన్నది.

2). అక్షర హాసన్:
కోలీవుడ్ , టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న కమలహాసన్ రెండవ కుమార్తె అక్షర హాసన్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చినా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఈమె సోదరి శృతిహాసన్ మాత్రం స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది.

- Advertisement -

3). శివాని రాజశేఖర్-శివాత్మిక రాజశేఖర్:
వీరిద్దరూ టాలీవుడ్ సెలబ్రెటీలు రాజశేఖర్, జీవిత కుమార్తెలు.. వీరిద్దరూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా.. వీరిద్దరూ సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నారు.తల్లితండ్రులు మాత్రం స్టార్ స్టేటస్ ని అందుకున్నా వీరు మాత్రం ఆ పొజిషన్ కి చేరుకోలేకపోతున్నారు.

4). ఐశ్వర్య అర్జున్:
యాక్షన్ కింగ్ అర్జున్ టాలీవుడ్ , కోలివుడ్ ప్రేక్షకులకు సైతం సుపరిచితమే.. ఈయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయగా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది .దీంతో తాను హీరోయిన్ గా కొనసాగించలేనని తెలుసుకున్న ఈమె డాక్టర్ వృత్తి లో సెటిల్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలే వివాహ బంధం లోకి అడుగుపెట్టబోతోంది.

5). కార్తీక నాయర్:
అలనాటి హీరోయిన్ రాధా కుమార్తె కార్తీక్ నాయర్ కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో తన కుటుంబం యొక్క హోటల్ బిజినెస్ లను చూసుకుంటూ ఉన్నది. ఇటీవల ఒక బిజినెస్ మాన్ ని ప్రేమించి మరి వివాహం చేసుకుంది కార్తీక నాయర్.

ఇక వీరే కాకుండా చాలామంది సెలబ్రిటీల పిల్లలు కూడా సక్సెస్ కాలేకపోతున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు