Rakul Preet: ప్రేమికులకు పనికిమాలిన సలహా ఇచ్చిన రకుల్..!

ఈ కాలం జనరేషన్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చూసిన వెంటనే లవ్, ఆ తర్వాత డేటింగ్, ఆ తర్వాత బ్రేకప్.. ఇలా హద్దులు దాటి ఈ కాలం జనరేషన్ మితిమీరిపోతుంది. ఇలాంటి జంటలనే మనం ఎక్కువగా చూస్తున్నాం.

అయితే ఈ జనరేషన్ లో ఇటువంటివారిని మరింత రెచ్చగొట్టేలా కామెంట్స్ చేసింది పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. కెరటం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అనతికాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగి అగ్ర హీరోలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది.

రకుల్ లేలేత అందాలతో వెండితెర తడిసి ముద్దయింది. ఈ అమ్మడు 1990 అక్టోబర్ 10న పంజాబీ ఫ్యామిలీలో జన్మించింది. న్యూఢిల్లీకి చెందిన కుల్విందర్ సింగ్, రాజేందర్ కౌర్ దంపతులకు జన్మించింది. తండ్రి ఆర్మీ ఆఫీసర్. దీంతో ఆమె చదువు కూడా ఆర్మీ స్కూల్ లోనే జరిగింది. ఈనెల 10వ తేదీన ఈమె 32వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ క్రమంలోనే అభిమానులతో ముచ్చటించిన రకుల్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది.

- Advertisement -

“జీవితంలో ఎటువంటి నిబంధనలు లేనప్పుడే సంతోషంగా జీవించగలం. ప్రేమలో ఎలాంటి నాటకీయత ఉండకూడదు. నిజాయితీగా ప్రవర్తించడం చాలా ముఖ్యం. నిజాయితీగా ఉన్న వాళ్ళతో మనం రూల్స్ బ్రేక్ చేసినా తప్పులేదు. ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించుకోవాలి. ఒకరి అభిప్రాయాలను మరొకరిపై రుద్దనంతవరకు ఏ ప్రేమ అయినా సక్సెస్ అవుతుంది” అంటూ యువతను తప్పుదారి పట్టించే విధంగా కామెంట్స్ చేసింది. దీంతో రకుల్ ని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్లు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు