NC22 : సీఎం పాత్రలో..

అక్కినేని న‌ట వార‌సుడు నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలను చేస్తూ చాలా బిజీగా గ‌డిపేస్తున్నాడు. ప్ర‌స్తుతం త‌మిళ ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భుతో ఓ సినిమా చేస్తున్నాడు. ‘NC22’ అనే వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న కృతిశెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే వీరిద్ద‌రు బంగార్రాజు సినిమాలో క‌లిసి న‌టించారు. ఈ చిత్రంలో ఈ జంట‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

NC22 చిత్రం ఇటీవ‌లే తొలి షెడ్యూల్ రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ పూర్తి చేసుకుని, ఆ త‌రువాత క‌ర్ణాట‌క‌లో షూటింగ్ జ‌రుపుకుంది. ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌యరాజాతో పాటు అత‌ని కుమారుడు యువ‌న్ శంక‌ర్ రాజా కూడా సంగీతం స‌మ‌కూర్చ‌డం విశేషం. ఈ చిత్రాన్ని శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్ ప‌తాకంపై శ్రీ‌నివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. మ‌రోవైపు ఇటీవ‌ల ఈ చిత్రంలో న‌టించే న‌టీన‌టులంద‌రిని ద‌ర్శ‌కుడు ప‌రిచ‌యం చేసిన విష‌యం తెలిసిందే.

అందులో ముఖ్యంగా ప్రియ‌మ‌ణి,  ప్రేమి విశ్వ‌నాథ్‌ (వంట‌ల‌క్క) ,వెన్నెల కిషోర్ వంటి తారాగానాన్ని ప‌రిచ‌యం చేశారు. ఈ చిత్రంలో నేష‌న‌ల్ అవార్డు గ్ర‌హిత ప్రియ‌మ‌ణి ముఖ్యమంత్రి పాత్ర‌లో,  నాగ‌చైత‌న్య ఓ పోలీస్ అధికారిగా క‌నిపించ‌నున్నట్టు సోష‌ల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అయితే దీని పై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అదికారిక ప్రకటన రాలేదు. కానీ త్వరలోనే ప్రియమణి పాత్రపై మూవీ యూనిట్ నుంచి అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు