Kamal Haasan : చాలా రోజుల తరువాత

త‌మిళ ద‌ర్శ‌కుడు లోకేశ్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌కత్వంలో క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన చిత్రం విక్ర‌మ్‌. ఈ సినిమా జూన్ 03, 2022న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. 2022 ఏడాది బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ఇది ఒకటి. ఇప్పుడు ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. రాజ్ క‌మ‌ల్ ఫిల్మ్ ఇంట‌ర్నేష‌న‌ల్ నిర్మించిన యాక్ష‌న్ డ్రామాలో క‌మ‌ల్ హాస‌న్‌, విజ‌య్ సేతుప‌తి, ఫ‌హ‌ద్ పాసిల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. త‌మిళ హీరో సూర్య కూడా ఓ పాత్ర‌లో క‌నిపించ‌డం విశేషం.

బాక్సాపీస్ వ‌ద్ద ఈ సినిమా క‌లెక్ష‌న్లు రికార్డు సృష్టించింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ సినిమా హిట్ పై తాజాగా న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ స్పందించారు. విక్ర‌మ్ సినిమా స‌క్సెస్ కి భాగ‌మైన ప్ర‌తి ఒక్క‌రికీ క‌మ‌ల్ త‌న హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ రా ఏజెంట్‌గా ప‌వ‌ర్ ఫ్యాక్ట్ యాక్ష‌న్ మోడ్‌లో క‌నిపించాడు. క‌మ‌ల్ కెరీర్‌లోనే చెప్పుకోద‌గిన చిత్రంగా నిలిచిన ఈ సినిమా త‌మిళ‌నాడులోని ప‌లు సెంట‌ర్ల‌లో 100 రోజులు పూర్తి చేసుకుంది. చెన్నైలోని క‌లైవ‌నార్ అరంగం వేదిక‌గా 100 రోజుల ఫంక్ష‌న్ ని గ్రాండ్‌గా నిర్వ‌హించ‌డానికి ప్లాన్ చేశారు మేక‌ర్స్‌.

న‌వంబ‌ర్ 07న ఈ వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు. న‌వంబ‌ర్ 07 సాయంత్రం 5 గంట‌ల‌కు వేడుక ప్రారంభ‌మ‌వుతుంది. ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన సినిమాలు ఏవి కూడా వంద రోజులు జ‌రుపుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఒక సినిమా వంద రోజులు ఆడాలంటే మంచి కంటెంట్ ఉండి ఆడియెన్స్ కి బోరు కొట్ట‌కుంటా ఉంటే త‌ప్ప వంద రోజులు ఆడ‌డం లేదు. ప్ర‌స్తుతం ఏ సినిమా ఎంత వ‌సూలు చేసింద‌ని రికార్డులు చూసుకుంటున్నారే త‌ప్ప.. ఏ సినిమా ఎన్ని రోజులు ఆడింద‌నే విష‌యం ఇప్పుడు ప‌ట్టించుకోవ‌డం లేదు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు