Prabhas : ఇద్దరు భామలతో..

ప్రభాస్ చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. సాహో, రాధేశ్యామ్ తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ఆదిపురుష్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సలార్, మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కె, అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ వంటి భారీ చిత్రాలను చేస్తున్నాడు. ఈ భారీ చిత్రాల మధ్య కామెడీ సినిమాలను తెరకెక్కించే మారుతితో కూడా సినిమా చేస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ముందుగా ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తారని వార్తలు వచ్చాయి. కానీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి కొన్ని వార్తలు టాలీవుడ్ సర్కిల్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీనికి రాజా డీలక్స్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని, సినిమా కూడా మొత్తం ఒక థియేటర్ నేపథ్యంలో ఉంటుందని సమాచారం అందుతుంది. అలాగే ఈ చిత్రం తాత మనవళ్ల బంధంతో ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో డార్లింగ్ తో ఇద్దరు భామలు ఆడి పాడ బోతున్నారట. గత కొన్ని రోజుల నుంచి మాళవిక మోహనన్ పేరు వినిపిస్తోంది. కానీ ఇప్పుడు మాళవిక తో పాటు నిధి అగర్వాల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. నిధి అగర్వాల్ ఇప్పటికే మెగా ఛాన్స్ కొట్టేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమాలో పంచమి అనే పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ తో ఛాన్స్ దక్కించుకుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు