రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. “పుష్ప” చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక.. ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్ సినిమాలు ఇంకా రిలీజ్ కాకముందే అక్కడ రష్మికకు మంచి పాపులారిటీ వచ్చేసింది. ” ఛలో” అంటూ తెలుగులో తన సినిమా ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ” గీతా గోవిందం, దేవదాస్, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి చిత్రాలతో వరుస హిట్లు సొంతం చేసుకుంది.
ఇక పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర చేసిన ఆమె అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం పుష్ప 2 తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పలు సినిమాలకు ఓకే చెప్పింది. సినిమాలతోనే కాదు ప్రేమ వ్యవహారంతోను వార్తలలో నిలుస్తూ ఉంటుంది రష్మిక. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రేమ మీద తన అభిప్రాయాన్ని అడగగా హాట్ కామెంట్స్ చేసింది.
Read More: Prakash Raj : ‘ఇష్టం లేకపోయినా చేశాను’
మిమ్మల్ని నేషనల్ క్రష్ అంటారు కదా.. ప్రేమపై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించగా.. “నువ్వు మాకు అందుబాటులో ఉండడం లేదు అని కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆల్రెడీ నాతో ఎప్పుడూ చెబుతూ ఉంటారు. రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు మనం చాలా టైం ఇవ్వాలి. ప్రేమలో ఉంటే ఆ బంధాన్ని నిలుపుకోవడానికి చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా తగినంత సమయాన్ని కేటాయించాలి. ప్రస్తుతం నేను సినిమాలలో చాలా బిజీగా ఉన్నాను. ప్రేమించే అంత టైం లేదు. ఇప్పుడు నేను ఏ రిలేషన్ లోను లేను. ఎవరినైనా ప్రేమిస్తే నేనే ఆ విషయాన్ని ముందుగా వెల్లడిస్తా” అని చెప్పుకొచ్చారు. ఇక విజయ్ దేవరకొండ తో రిలేషన్షిప్ గురించి ప్రశ్నించగా.. అవి క్యూట్ గా ఉన్నాయని.. అయితే వాటి గురించి ఎప్పుడూ విజయ్ తో డిస్కస్ చేయలేదని చెప్పుకొచ్చారు.
Read More: 18 Pages: సినిమా ఎండింగ్ మాత్రం అలా గుర్తుండిపోతుందన సూర్య ప్రతాప్ పల్నాటి
సినిమా ఇండస్ట్రీలో ఏం మాట్లాడినా ఆచి...
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ వచ్చే వారు...
టాలీవుడ్ టాప్ డ్యాన్సర్ ఎవరు? ఈ ప్రశ్నకు...
టాలీవుడ్ హాట్ బ్యూటీ పాయల్ రాజ్పుత్...
సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన...