Sankranthi 2025 : సంక్రాంతి రేసులోకి ప్రభాస్ ఇన్… చిరు అవుట్

ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద నెలకొన్న క్లాష్ ను దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు వచ్చే ఏడాది సంక్రాంతిపై ఇప్పటి నుంచే కర్చీఫ్ వేసేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ హీరోలు వెంకటేష్, నాగార్జున, చిరంజీవి లాంటి హీరోలు ఈ సంక్రాంతికి పోటీ పడడానికి రెడీగా ఉన్నారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ కూడా 2025 సంక్రాంతి రేసులోకి దిగబోతున్నారు. శతమానం భవతి సీక్వెల్ తో నిర్మాత దిల్ రాజు కూడా అప్పుడే సంక్రాంతిపై కన్నేశారు. సంక్రాంతి సీజన్ వరకు ఈ ఎన్ని సినిమాలు పూర్తవుతాయి అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ సేఫ్ సైడ్ అన్నట్టుగా ఇప్పటినుంచే మేము సంక్రాంతికి రాబోతున్నాం అని అఫీషియల్ గా అనౌన్స్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి రేసులో నుంచి చిరంజీవి అవుట్ అయ్యాడని, ఆయన ప్లేస్ లోకి ప్రభాస్ వస్తున్నాడని తెలుస్తోంది.

చిరు అవుట్… ఇదే రీజన్
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. ఈ మూవీలో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా, బింబిసారా ఫేమ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న విశ్వంభర మూవీని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. అనుకున్న విధంగానే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శర వేగంగా పూర్తి చేస్తున్నారు. అందులో భాగంగానే సెప్టెంబర్ లోపే “విశ్వంభర” షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. ఇక షూటింగ్ సంగతి పక్కన పెడితే ఇది ఒక సోషియో ఫాంటసీ మూవీ కాబట్టి సిజిఐ వర్క్ పై మేకర్స్ ఎక్కువగా డిపెండ్ కావలసి ఉంటుంది. విజువల్ వండర్ గా ఉండాలంటే సిజిఐ వర్క్ చాలా ముఖ్యం. దీనికి షూటింగ్ కంటే రెండు రెట్లు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే అనౌన్స్ చేసిన విధంగా విశ్వంభర సంక్రాంతికి రావడం కష్టమేనని అంటున్నారు. అంతేకాకుండా సిజిఐ వర్క్ కారణంగా ఇప్పటికే ఎన్నో సినిమాలు పోస్ట్ పోన్ కావడం మనం చూసాము. కాబట్టి కచ్చితంగా విశ్వంభర సంక్రాంతి రేసు నుంచి అవుట్ అయినట్టేనని టాక్ నడుస్తోంది.

ప్రభాస్ ఇన్… ఇదుగో సాక్ష్యం
సంక్రాంతి అనేది నిర్మాతలకు కాసుల వర్షం కురిపించే మంచి సీజన్. కంటెంట్ సంగతి ఎలా ఉన్నా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉన్న మూవీ రిలీజ్ అయితే ఇక నిర్మాతలకు లాభాల పంట పండినట్టే. అందుకే చాలామంది నిర్మాతలు సంక్రాంతిని టార్గెట్ గా చేసుకొని పోటాపోటీగా సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటారు. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ రాజా సాబ్ సంక్రాంతి రేసులోకి అడుగు పెట్టబోతుందని తెలుస్తోంది. విశ్వంభర మూవీ పోస్ట్ పోన్ అవుతుంది అనడానికి ఇది కూడా ఒక కారణమే. మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ రాజా సాబ్ పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ అని, ఆ సమయంలో రిలీజ్ అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అని నమ్ముతున్నారు. ఇక రాజా సాబ్ మూవీని నిర్మిస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీం ఇప్పటికే రాజా సాబ్ సంక్రాంతికి రిలీజ్ అవుతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తాము ఎలాంటి క్లాష్ ఎక్స్పెక్ట్ చేయట్లేదని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ మూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతుందంటే కచ్చితంగా చిరంజీవి మూవీ పోస్ట్ పోన్ అయినట్టే. ఇక ఇప్పటికే సంక్రాంతి రేసులో ఎన్నో సినిమాలు ఉండగా, చెప్పిన టైంకి ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి అన్నది అనుమానమే.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు