Raja Saab : మెగాస్టార్ తో ప్రభాస్ వార్? “రాజా సాబ్” రాకపై హింట్ ఇచ్చిన మేకర్స్

Raja Saab

ఈ ఏడాది సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫైట్ జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఇంతకంటే పెద్ద వారే జరగబోతోంది. తాజాగా “రాజా సాబ్” నిర్మాత చేసిన ప్రకటనతో 2025లో మెగాస్టార్ చిరంజీవి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మధ్య క్లాష్ రాబోతుందన్న విషయాన్ని స్పష్టం చేసింది.

రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది చివర్లో “సలార్” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకొని బౌన్స్ బ్యాక్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాల్లో “రాజా సాబ్” కూడా ఒకటి. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ హార్రర్ కామెడీ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వివేక్ కూచిబొట్ల, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ సరసన తమిళ బ్యూటీ మాళవిక మోహనన్ నటిస్తుండగా, మరో ముగ్గురు హీరోయిన్లు కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

ఇక ఇటీవల విడుదలైన “రాజా సాబ్” ఫస్ట్ లుక్ చూసాక ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే నిర్మాతలు కూడా వాళ్ళ ఇష్టప్రకారమే 2025 సంక్రాంతికి “రాజా సాబ్”ను తీసుకురాబోతున్నట్టుగా ప్రకటించారు. ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతున్న “ఈగల్” ప్రమోషన్లలో భాగంగా నిర్మాత విశ్వప్రసాద్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగానే సంక్రాంతికి ప్రభాస్ కోసం ఒక స్లాట్ ఉంటుందని, 2025 సంక్రాంతి కానుకగా “రాజా సాబ్” రిలీజ్ అవుతుందని ప్రకటించారు. త్వరలోనే రిలీజ్ డేట్ కు సంబంధించిన అధికారిక అనౌన్స్మెంట్ వస్తుందని విశ్వప్రసాద్ వెల్లడించారు. ఈ నెలలోనే “రాజా సాబ్” రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్డేట్ రాబోతోందని తెలుస్తోంది. “కల్కి” మూవీ రిలీజ్ అయిన తర్వాత “రాజా సాబ్” ప్రమోషన్లు స్టార్ట్ కానున్నాయి.

- Advertisement -

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి “విశ్వంభర” సినిమాతో సంక్రాంతిపై ముందుగానే కర్చీఫ్ వేసేసారు. గత ఏడాది భోళా శంకర్ సినిమాతో భారీ డిజాస్టర్ ను చవిచూసిన మెగాస్టార్ ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే “విశ్వంభర” మూవీని 2025 జనవరి 10న రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు. గతంలో ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అందుకే చిరంజీవి సంక్రాంతిని సెంటిమెంట్ గా భావిస్తున్నట్టు తెలుస్తోంది. 200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ “విశ్వంభర” ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వీళ్ళిద్దరి మధ్య క్లాష్ ఏర్పడితే టాలీవుడ్ షేక్ అవ్వడం ఖాయం. మరి నిర్మాతలు ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు