మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సినిమా అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా హరి హర వీరమల్లు. పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో తొలిసారి పీరియాడికల్ నేపథ్యంలో ఉన్న స్టోరీలో నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను 150 కోట్ల బడ్జెట్ తో మెగా సూర్య ప్రొడక్షన్ పై ఎ. దయాకర్ రావు నిర్మిస్తుండగా ఏ.ఎం రత్నం సమర్పిస్తున్నాడు. ఇది పవన్ కెరీర్ లో భారీ బడ్జెట్. ఇంత భారీ బడ్జెట్ తో వస్తున్న హరి హర వీరమల్లును క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నాడు.
అయితే ఈ సినిమా స్టార్ట్ చాలా రోజులు అవుతున్నా.. ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో పవన్ ఈ సినిమా పై ఫుల్ ఫోకస్ పెట్టాడు. త్వరగా షూటింగ్ ను పూర్తి చేయాలని డైరెక్టర్ తో కూడా చెప్పాడు. దీంతో కొత్త షెడ్యూల్ ఇటీవల స్టార్ట్ అయింది. కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించినట్టు సమాచారం. అయితే ఈ కొత్త షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం.. కొత్త షెడ్యూల్ లో పవన్ ఇంత వరకు పాల్గొనలేరట.
Read More: Sreeleela : ఆఫర్లు.. రెమ్యూనరేషన్
కొత్త షెడ్యూల్ లో పాల్గొనడానికి పవన్ రెడీ అవుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం పవర్ స్టార్ తన పార్టీ పనుల్లోనే బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. కాగా హరి హర వీరమల్లును సంక్రాంతి బరిలో దింపాలని టీం భావించింది. దీనిపై అధికారిక ప్రకటన కూడా చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా షూటింగ్ సంక్రాంతి వరకు పూర్తి కావడం కష్టమే. ఒక వేళ షూటింగ్ పూర్తి అయినా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కావట. దీంతో హరి హర వీరమల్లు సంక్రాంతి రాకపోవచ్చు.
Read More: Madhavi Latha: పెళ్లికి ముందే.. ఆ పని చేయాల్సిందే…!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్...
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’...
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్...
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్...
టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా...