Waltair Veerayya : ఫస్ట్ సింగిల్ కు డేట్ ఫిక్స్

ఆచార్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. కె. ఎస్ రవీంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే చిరంజీవికి జోడీగా శ్రుతి హాసన్ నటిస్తుండగా, కేథరిన్ ట్రెసా, బాబి సింహా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు మెగా 154 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం, దీపావళి సందర్భంగా టైటిల్ ను వాల్తేరు వీరయ్య గా ఫిక్స్ చేస్తూ విడుదల చేశారు.

అలాగే ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని అఫీషయల్ గా అనౌన్స్ చేశారు. సంక్రాంతికి ఈ చిత్రం రావడంతో సంక్రాంతి పోటీ ఆసక్తి కరంగా మారింది. సంక్రాంతికి ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో మెగా ఫ్యాన్స్ వాల్తేరు వీరయ్య నుంచి అప్ డేట్ ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

ఇది చిత్ర యూనిట్ చెవిలో పడటంతో వాల్తేరు వీరయ్య అప్ డేట్స్ పై దృష్టి సారించినట్టు తెలుస్తుంది. వచ్చే నెల 14వ తేదీన వాల్తేరు వీరయ్య నుంచి ఒక అప్డేట్ ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతుంది. ఈ చిత్రంలోని మొదటి సాంగ్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. నవంబర్ 14 నుంచి ఈ చిత్రం నుండి వరుసగా అప్డేట్స్ వస్తాయని తెలుస్తుంది. కాగా వాల్తేరు వీరయ్య చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి విధితమే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు