Chiranjeevi: ఒక్కరే కష్టం అంటే – ఏకంగా డజను మంది హీరోయిన్లా చిరు..?

సంక్రాతి సందర్బంగా విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి ఈ ఏడాది బ్లాక్ బస్టర్ తో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్న చిరు వరుసగా యంగ్ డైరెక్టర్స్ తో స్టోరీ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల రిజల్ట్ కారణంగా తన ఆలోచనా తీరు మార్చిన చిరు ఇప్పుడు యాంగ్ డైరెక్టర్స్ కి మాత్రమే ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కళ్యాణ్ కృష్ణ కురసాల, ప్రసన్న బెజవాడ, బింబిసార ఫేమ్ వశిష్ఠ లు వినిపించిన కథలకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న సమాచారం ఉండగా, వశిష్ఠతో చేయబోయే సినిమా గురించి వినిపిస్తున్న వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి.
జగదేకవీరుడు, అతిలోక సుందరి తరహాలో సోషియో ఫాంటసీ జానర్లో రూపొందబోయే ఈ సినిమాకు ‘ముల్లోక వీరుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో చిరంజీవి ముల్లోకాలకు వెళ్లి అక్కడి దేవుళ్లతో సంభాషించే సీక్వెన్స్ ఉంటుందని అందుకే ‘ముల్లోక వీరుడు’ అన్న టైటిల్ ఫిక్స్ చేసారని అంటున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా వినిపిస్తున్న మరో అప్డేట్ సినిమాఫై ఆసక్తి పెంచే విధంగా ఉంది. అదేంటంటే ఈ సినిమాలో చిరంజీవి సరసన ఏకంగా 12మంది హీరోయిన్లు నటించనున్నారని వినిపిస్తున్న టాక్ అందరిని షాక్ కి గురి చేస్తోంది.
అసలే ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లు సీనియర్ హీరోల సరసన నటించేందుకు ఆసక్తి చూపట్లేదు. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా ఇందుకు ఉదాహరణగా చెప్పచ్చు, ఈ సినిమాలో సీనియర్ బాలకృష్ణ కి జోడిగా టాలీవుడ్ అసలు పరిచయం లేని మలయాళ భామ హాని రోజ్ ని తీసుకోవాల్సి రావటానికి స్టార్ హీరోయిన్లు ముందుకు రాకపోవటమే అన్నది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు చిరంజీవి సినిమాలో 12మంది హీరోయిన్లు అంటే, వారు టాలీవుడ్ హీరోయిన్లేనా లేక ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్లను తెస్తారా అన్న చర్చ మొదలైంది. 12మంది క్రేజ్ ఉన్న హీరోయిన్లను ఒకే సినిమాలో నటింపచేయటం అన్నది మామూలు విషయం కాదు,ఇటు బడ్జెట్ పరంగా, అటు డేట్స్ అడ్జస్ట్ చేయటంలో నిర్మాతకు, డైరెక్టర్ కు ముచ్చమటలు పట్టే అంశం. ఇందులో నిజమెంతో తెలియాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు