Sudhir Varma: ఆ డైరెక్టర్ పై ఫైర్ అవుతున్న నెటిజన్లు..!

సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా రావణాసుర సినిమా ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్య, ధమాకా వంటి వరుస హిట్స్ తో ఉన్న రవితేజ సినిమా కాబట్టి ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి విడుదలకి ముందు. కానీ, రిలీజ్ అయ్యాక సీన్ రివర్స్ అయ్యింది. మితి మీరిన బూతు డైలాగులు, లాజిక్ లేని సీన్లు, శృతి మించిన యాక్షన్ సీన్లు ఉండటం వల్ల ఆడియెన్స్ ఈ సినిమాని తిరస్కరించారు. పాతకాలం నాటి మాస్క్ కాన్సెప్ట్ ని సిల్లీగా ఎక్సిక్యూట్ చేయటంతో డైరెక్టర్ సుధీర్ వర్మపై విమర్శలు వెల్లువెత్తాయి. అభిమానులు సైతం రవితేజ ని నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో యాక్సెప్ట్ చేయలేకపోయారు.

డిజాస్టర్ టాక్ తో దాదాపు వారం, పది రోజులకే థియేటర్ల నుండి వెనుతిరిగిన ఈ సినిమా ఇటీవలే ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఏ మాత్రం పబ్లిసిటీ లేకుండా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమాను చుసిన ఆడియెన్స్ మళ్లీ సుధీర్ వర్మపై విమర్శలు చేస్తున్నారు. సినిమా హీరోగా నటించటమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించిన రవితేజ కూడా కథని జడ్జ్ చేయలేకపోయాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

స్వామిరారా సినిమాతో హిట్ కొట్టి తొలి ప్రయత్నంలోనే తన సత్తా చాటిన సుధీర్ వర్మ, ఆ తర్వాత ఒక్క హిట్ కూడా పొందలేకపోయాడు. సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ రణరంగం వంటి సినిమాల్లో టేకింగ్ కి ప్రశంసలు దక్కాయి సుధీర్ వర్మకి. కానీ, రావణాసుర సినిమా విషయంలో అందరూ సుధీర్ వర్మని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ, టోరంటినో సినిమాల ఇన్స్పిరేషన్ తూ కథలు రాస్తుంటా అని చెప్పుకునే సుధీర్ తదుపరి సినిమాతో అయినా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు