Power Star: ఊపు మీదున్న ఉస్తాద్ – పని మొదలెట్టిన డీఎస్పీ..!

రాజకీయాలకు గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్న పవన్ మూడు సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ గ్యాప్ లేకుండా పని చేస్తున్నాడు. ఇటీవలే ఓజీ సినిమా నుండి వచ్చిన గ్లిమ్ప్స్ సినిమాపై అంచనాలను పెంచుతుంటే, తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ నుండి మరో అప్డేట్ ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా కోసం దర్శకుడు హరీష్ శంకర్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేసారు.

ఈ మేరకు మైత్రి మూవీస్ వారు ‘రాసుకోరా సాంబ’ అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ కాంబినేషన్లో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ ఆల్బమ్ సూపర్ హిట్ అవ్వటంతో ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్బమ్ కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2024 సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

ఇటీవల ప్రారంభమైన ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను చకచకా పూర్తి చేస్తున్న పవన్, చాలా కాలం కిందట మొదలైన హరిహర వీరమల్లు సినిమాను నత్త నడకన నడిపిస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా వైడ్ ప్లాన్ చేసిన ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు సినిమా నుండి ఏదైనా అప్డేట్ వస్తుందో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు