Shaakuntalam: సమంత బిహేవియర్ గురించి ఫోటోలతో సహా బయటపెట్టిన నెటిజన్..!!

ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరే ఓ రేంజ్ లో మార్మోగిపోతుంది. దానికి కారణం ఆమె రీసెంట్ గా నటించిన శాకుంతలం సినిమా. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 14వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీలోనూ విడుదలైంది. ఈ సినిమా మొదటి షో తోనే నెగిటివ్ టాక్ ని మూటగట్టుకుంది. బోరింగ్ సన్నివేశాలు, కార్టూన్ సినిమాలను తలపించిన విఎఫ్ఎక్స్, అర్థం కాని సంభాషణలు కలగలిపి ఈ సినిమాకి నెగటివ్ టాక్ వచ్చేలా చేశాయని చెప్పొచ్చు. అంతేకాదు ఈ సినిమాలో పెద్దగా ఆత్రుత పడి చూడాల్సిన అంశాలు ఏమీ లేవని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.

ఈ నేపథ్యంలోనే ఓ ట్విట్టర్ యూజర్ ఓపెన్ గా సమంత సినిమా బాగోలేదు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో కోపంతో ఊగిపోయిన సమంత అతడిని బ్లాక్ చేసింది. అయితే అతడు అక్కడితో ఆగకుండా బ్లాక్ చేసిన స్క్రీన్ షాట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ” సమంత ఎంత చీప్ గా బిహేవ్ చేస్తుందో చెప్పేందుకు ఇది ఒక ఎగ్జాంపుల్” అని మరో పోస్ట్ పెట్టాడు ఆ నెటిజన్. అంతేకాదు ఈ సినిమాలో సామ్ డబ్బింగ్ అస్సలు బాగోలేదని.. తాను చూసిన వరస్ట్ సినిమాలలో శాకుంతలం సినిమా మొదటి స్థానంలో ఉందంటూ ట్వీట్ చేశాడు.

అయితే ఈ తతంగాన్ని చూసిన నెటిజెన్స్.. జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా బ్యాలెన్స్ చేసే సమంత.. ఇలా ఓ నెటిజన్ కామెంట్ చేశాడని అతడిని బ్లాక్ చేయడం ఎంతవరకు న్యాయం అంటూ మండిపడుతున్నారు. ఇండస్ట్రీలో హిట్స్ – ఫ్లాప్స్ సర్వసాధారణం అని.. ఇలాంటివి స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంతకి తెలియకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో అతడిని బ్లాక్ చేసిన సమంత స్క్రీన్ షాట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు