Tollywood: రుద్రంగి టీజర్.. సరి కొత్త అవతారంలో జగ్గు భాయ్

టాలీవుడ్ లో జగపతి బాబు గురించి తెలియని వారుండరు. ఫ్యామిలీ చిత్రాలకు కేరాఫ్ గా, మ్యాన్లీ స్టార్ గా తెలుగు లో ఓ వెలుగు వెలిగిన జగపతి బాబు, ఆ తర్వాత కొత్త తరం హీరోల పోటీ ఎక్కువ అవడం తో హీరోగా సినిమాలు తగ్గించారు. ఆ తర్వాత బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా తో విలన్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించారు. అప్పుడు కుడా హీరోకు వస్తున్న ఆదరణే వచ్చింది. వరుసగా రంగస్థలం, అరవింద సమేత, మహర్షి లాంటి సినిమాల్లో ప్రతి నాయకుడి గా మెప్పించారు. ప్రస్తుతం ఆయన విలన్ గా నటించిన బాలీవుడ్ మూవీ “కిసి కా భాయ్ కిసి కా జాన్” సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

తాజాగా జగపతి బాబు మెయిన్ లీడ్ లో నటించిన ఒక కొత్త సినిమా టీజర్ ఈ రోజు విడుదలైంది. ఆ చిత్రం పేరు రుద్రంగి. తెలంగాణ గడీల నేపథ్యం లో 1950 ల్లో జరిగే కథ గా ఈ సినిమా రూపొందించబడింది. ఈ మూవీ లో ‘భీంరావ్ దొర’ గా జగపతి బాబు పవర్ ఫుల్ ప్రతినాయకుడి రోల్ లో నటించారు. ఇక ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా చాలా రోజుల తర్వాత తెలుగులో నటించిన మమతా మోహన్ దాస్. ఈ సినిమాలో ఆమె ఫిమేల్ లీడ్ గా జ్వాలా బాయి దేశముఖ్ గా నటించింది. ఇంకా ఈ సినిమాలో విమలా రామన్, కాలకేయ ప్రభాకర్, ఆశిష్ గాంధీ, గణవి లక్ష్మణ్ తదితరులు నటించారు.

రుద్రంగి సినిమాను రసమయి ఫిల్మ్స్ బ్యానర్ లో తెలంగాణా ప్రముఖ గేయ రచయిత ఇంకా ఎమ్మెల్యే అయిన ‘రసమయి బాలకిషన్’ నిర్మించారు. రుద్రంగి సినిమాను అజయ్ సామ్రాట్ డైరెక్ట్ చేయగా, నౌఫాల్ రాజా మ్యూజిక్ అందించాడు. 2023 ద్వితీయార్థంలో ఈ సినిమా విడుదల అవుతుంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు