Pawan kalyan : OG లో ప్రభాస్ ?

సుజీత్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తోన్న OG సినిమా షూట్ ఇటీవలే ముంబై లో స్టార్ట్ అయినా విషయం తెల్సిందే. దానయ్య DVV సమర్పణలో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందుతుంది. గన్స్ , వైలెన్స్ , గ్యాంగ్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ కంబ్యాక్ తరువాత చేస్తున్న సినిమాలలో OG ఒక్కటే స్ట్రయిట్ సినిమా అవడం ప్రేక్షకులలో, ఫ్యాన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా కి సంబంధించి షూటింగ్ స్టార్ట్ అయింది అని చెప్తూ ఇటీవల రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. సుజీత్ కేమియోగా ఉన్న ఈ వీడియో ఫ్యాన్స్ కి తెగ నచ్చింది. ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా థియేటర్స్ లో ఆయన సినిమాలకి రచ్చ రచ్చ చేసి, ఇప్పుడు పవన్ తో సినిమా చేస్తుండటంతో ఫ్యాన్స్ చాలా హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.

అయితే ఇంత హప్పినెస్స్ లో ఉన్న ఫాన్స్ కి మరో క్రెజి హింట్ ఇచ్చాడు సుజీత్. అది ఏంటనే OG సినిమా షూటింగ్ ప్రోగ్రెస్ వీడియోలో ప్రభాస్ స్కెచ్ ఆర్ట్స్ కనిపించాయి. అవి నోటిస్ చేసిన కొంతమంది ప్రభాస్ గెస్ట్ అప్పియరెన్స్ చేయబోతున్నాడు OG లో అని ఫిక్స్ అయ్యారు.

- Advertisement -

సుజీత్ తలుచుకుంటే ప్రభాస్ ని OG లో గెస్ట్ రోల్ లో కనిపించడానికి ఒప్పించడం పెద్ద కష్టమేమి కాదు. ప్రభాస్ కి సుజీత్ అంటే చాల ఇష్టం. సుజీత్ కూడా ప్రభాస్ ని అన్న ,అంటూ రెస్పెక్ట్ ఇస్తాడు. అది కాకా ఇద్దరు కలిసి “సాహు” లాంటి సూపర్ హిట్ సినిమా చేసారు. మరి అందరు అనుకుంటున్నట్టుగా OG లో ప్రభాస్ నిజంగానే ఉన్నడా లేక తొందరలో జాయిన్ అవుతాడా అనేది సుజీత్ కి తప్ప ఎవరికీ తెలిదు.  అది కాకా మరి ఇది పబ్లిసిటీ స్టంట్ లేక నిజంగానే ప్రభాస్ ఉంటాడా అనేది చూడాలి. OG లో పవన్ కళ్యాణ్ సరసన మొదటిసారి గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంక మోహన్ నటిస్తుంది.  నెక్స్ట్ వీక్ పవన్ OG షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు