Naveen Polishetty: ఆ డిజాస్టర్ సినిమా రిజల్ట్ ను ముందుగానే పసిగట్టిన నవీన్ పోలిశెట్టి

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలలో ప్రేక్షకుల అభిరుచిని ఈజీ గా పసిగడుతూ సినిమాలు చేస్తున్న హీరోలలో నవీన్ పోలిశెట్టి ఒకడు. కెరీర్ బిగినింగ్ లో షార్ట్ ఫిలిమ్స్ మరియు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ వచ్చిన నవీన్ పోలిశెట్టి “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.

ఇప్పటి వరకు నవీన్ పోలిశెట్టి హీరోగా చేసినవి కేవలం మూడు సినిమాలే అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చూస్తే వరుసగా మూడు హిట్స్ రావడమన్నది చాలా పెద్ద విషయమనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో హీరోలుగా అడుగుపెట్టిన అందరు కమర్షియల్ సినిమాల మోజులో పడి కెరీర్ ను పాడు చేసుకుంటున్నారు. కానీ హీరో నవీన్ పోలిశెట్టి మాత్రం ఆ బరిలో పడకుండా జాగ్రత్తగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

అయితే ఇటీవలనే నవీన్ పోలిశెట్టి రిజెక్ట్ చేసిన ఒక సినిమా థియేటర్స్ లో రిలీజయింది. కాస్తో కూస్తో మూవీ యూనిట్ చేసిన ప్రమోషన్స్ కారణంగా ప్రేక్షకుల్లో ఆ సినిమాపై కాస్త పాజిటివిటీ వచ్చింది. ఇక తీరా మూవీ రిలీజ్ తరువాత చూస్తే సినిమా కథలో విషయంలో లేకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ సినిమా మరేదో కాదు కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్ రంజాన్. అయితే ఈ సినిమా నిజానికి హీరో నవీన్ పోలిశెట్టి చేయాల్సిన సినిమానట. కానీ నవీన్ పోలిశెట్టి రూల్స్ రంజాన్ కథ విన్నాక సినిమా రిజల్ట్ ముందుగానే పసిగట్టి ఆ సినిమాను సున్నితంగా రిజెక్ట్ చేసాడట. మరి దీనిబట్టి చూస్తే నవీన్ పోలిశెట్టి కు కథల విషయంలో ఎంత జడ్జ్మెంట్ ఉందొ చెప్పొచ్చు.

- Advertisement -

Filmify for the latest web stories on Celebrities, today’s Tollywood news, the latest images of actors & actresses, new movie ratings & reviews, and the latest entertainment news from all Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు