Boyapati srinu : మహేష్ బాబు ఏమైన చేయగలడు బోయపాటి ఆఫ్ స్క్రీన్ ఎలివేషన్స్ వైరల్

సూపర్ స్టార్ మహేష్ బాబు పై మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
ఎప్పటినుంచో మహేష్ ఫ్యాన్స్ అంతా బోయపాటి శ్రీను తో మహేష్ బాబు సినిమా చేస్తే చూడాలని వెయిట్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా బోయపాటి శ్రీను మహేష్ పై చేసిన స్టేట్మెంట్స్ సూపర్ స్టార్ అభిమానుల్లో జోష్ నింపాయని చెప్పవచ్చు.

ఇటీవలనే హీరో రామ్ పోతినేని తో స్కంద సినిమా తీసిన బోయపాటి శ్రీను తన తరువాత సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలను ఒక ఇంటర్వ్యూ లో వివరించారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన నెక్స్ట్ సినిమా ఉండబోతుందని చెప్పిన ఆయన. బాలకృష్ణ తో చేయబోయే అఖండ2 సినిమా గురించి కూడా మాట్లాడారు.

అయితే మరి మహేష్ బాబుతో సినిమా ఎప్పుడు చేస్తారని యాంకర్ ఆయనను అడగగా, ఆ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఇంతకుముందు చాలా సార్లు మహేష్ నాకు డిస్కషన్స్ జరిగాయి. కానీ డేట్స్ వల్ల మా ఇద్దరి కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్ళలేదు. ఖచ్చితంగా ఆయనతో నేను సినిమా చేస్తానని. అది కూడా మాస్ కమర్షియల్ సినిమానే అని చెప్పుకొచ్చాడు. అలాగే మహేష్ బాబు క్యారెక్టర్ గురించి ఆయన మాట్లాడుతూ మహేష్ అల్ రౌండర్, ఆయనతో ఎలాంటి సినిమా అయిన చేయొచ్చు అని అన్నారు.

- Advertisement -

ఇక మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన రాజమౌళి సినిమా చేయనున్నాడనే విషయం అందరికి తెలిసిందే . అయితే ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న రాజమౌళి మహేష్ ల సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక దీన్నిబట్టి చూస్తే రాజమౌళి సినిమా తరువాత మహేష్ ను డైరెక్ట్ చేసేది బోయపాటి శ్రీను నే అని చెప్పొచ్చు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు